కొణతాల టీడీపీ ప్రవేశం ఎప్పుడు?

Update: 2015-12-22 07:10 GMT
విశాఖ జిల్లాకు చెందిన కొణతాల రామకృష్ణ - గండి బాబ్జీ త్వరలో తెదేపాలో చేరనున్నారు. మంగళవారం ఉదయం ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు... కొణతాల రామకృష్ణను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి తీసుకెళ్లారు. సీఎంతో భేటీలో సమయంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా ఉన్నారు. కాగా గత కొంత కాలంగా వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొణతాల కొన్నాళ్లుగా టీడీపీలో చేరుతారనే వార్తలు వినిపించినా ఆ ముహూర్తం ఖరారు కాలేదు. ఇటీవల నెల కిందట ఆయన అయ్యన్నపాత్రుడి సహకారంతోనే ఓమారు చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాంతో ఆయన టీడీపీలో చేరుతారని అంతా భావించారు. కానీ ఇంతవరకు చేరలేదు... దీంతో అంతా ఆ విషయాన్ని మర్చిపోయిన సమయంలో కొణతాల మరోమారు చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తాజా భేటీలో అన్ని అంశాలు మాట్లాడుకున్నారని... ఇక టీడీపీలో చేరడమే తరువాయని తెలుస్తోంది. కొద్దిరోజుల్లోనే ఆయన పసుపు కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. కాగా కొణతాలతో పాటు గండిబాబ్జి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
Tags:    

Similar News