కొణతాల రామకృష్ణ.. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. 2004లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ఇప్పుడు ఎలాంటి పొజిషన్‌లో ఉండాలి. రాష్ట్ర రాజకీయాల్ని శాసించే పరిస్థితిలో ఉండాలి. కానీ కొణతాల పరిస్థితి మాత్రం అందుకు భిన్నం. దానికి ఆయన వైఖరే కారణం కాడు. కాసేపు వైసీపీ అంటారు - మరికాసేపు బీజేపీ అంటాడు. ఫైనల్ గా ఇప్పుడు టీడీపీకి తన మద్దతు ప్రకటించారు.
వైఎస్ మరణం తర్వాత వైసీపీలో చేరారు కొణతాల. కానీ ఆ తర్వాత ఎందుకో బయటకు వచ్చేశారు. ఈ ఐదేళ్లు ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటూ కాస్త హడావుడి చేసినా ఎలాంటి ఫలితం కన్పించలేదు. దీంతో ఏదో ఒక పార్టీలో చేరితే తప్ప ఉపయోగం లేదనుకుని చంద్రబాబుని కలిశారు. ఆయన పార్టీలోకి అహ్వానించారు కూడా. ఒకానొక దశలో టీడీపీ అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు టీడీపీలోకి వెళ్తే అధికారంలోకి వస్తుందో రాదో అని డౌటు పడిన ఆయన.. లోటస్ పాండ్ కు వచ్చి జగన్ ని కలిశారు. అయితే పార్టీ కండువా మాత్రం కప్పుకోలేదు. ఇలా అటా ఇటా అని రెండు పడవుల మీద కాలు పెట్టేసరికి ఇప్పుడు రెండు పార్టీలు కొణతాలకు హ్యాండ్ ఇచ్చేశాయి. ఇప్పుడు కొణతాల రామకృష్ణ ఏ పార్టీయో ఎవ్వరికి తెలీదు. ఇంకా చెప్పాలంటే ఆయనకే తెలియదు. పాపం కొణతాల పరిస్థితి ఇలా అయ్యిందేటి అని అందరూ చూసి జాలిపడడం తప్ప ఇంకేం చెయ్యలేరు. బంగారం లాంటి ఆఫర్ వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. కాదు చూద్దాం అంటే ఇలాగే అవుతుందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.