తెలంగాణ సీఎం కేసీఆర్ ను వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ తో కొండా మురళీ, సురేఖ దంపతులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చించినట్లు సమాచారం. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక గురించి ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు తన భర్త మురళీ కి వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని సురేఖ సీఎం కేసీఆర్‌ను కోరినట్లు వారి సన్నిహిత వర్గాలు తెలిపాయి.
అయితే చాలా రోజుల తరువాత కొండా దంపతులు కేసీఆర్ ను కలవడం రాజకీయ నేతల్లో ఆసక్తి రేపుతోంది. కొద్దికాలం క్రితం సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా కొండా దంపతులు ఆ పర్యటనకు హాజరుకాలేదు. అదే సమయంలో ఆ తర్వాత జరిగిన పలు సమావేశాలకు సైతం వారు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారితో చర్చించేందుకు కేసీఆర్ పిలిచారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు ఒక్క మహిళా ఎమ్మెల్యేకు కూడా కేబినెట్ స్థానం కల్పించరా అని రాద్ధాంతం చేస్తున్న సంగతి తెలిసిందే.
కొద్దికాలం క్రితం కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని కేసీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సదరు మార్పులు ఉంటాయా అనే సందేహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొండా సురేఖ కలువడంతో ఆ చర్చకు బలం చేకూరుస్తున్నట్లు అవుతుంది