హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయ వేడి ప్రారంభమైంది. అధికార పార్టీ దళిత బంద్ పథకంతో సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకర్షిస్తోంది. మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్రతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువ కాకుండా సమావేశాలను నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ పేరును ప్రకటించింది. బీజేపీ తరుపున ఈటల రాజేందర్ పోటీ దాదాపు ఖరారైంది. అయితే కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థి ప్రకటించలేదు.
మొన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొత్త పాలక వర్గం తరువాత కొత్త ఉత్సాహం నెలకొంది. దీంతో పార్టీ నుంచి పోటీ చేయడానికి కొందరు ఉత్సాహ పడుతున్నారాష్ట్ర నాయకత్వం మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గం నుంచి దామోదర పేరు అనుకోగా ఆయన పోటీ చేయనని తెలిపారు. అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్ పేరు వినిపించింది. ఆయన కూడా ఆసక్తిచూపలేదు. కానీ బీసీ సామాజిక వర్గం నుంచే పోటీకి దింపాలని పార్టీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఈ మధ్య కొండా సురేఖ పేరు బాగా వినిపిస్తోంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,26,590 మంది ఓట్లరు ఉన్నారు. వీరిలో రెడ్డి ఓట్లు 22,600, మున్నూరు కాపు 29, 100, పద్మశాలి 26,350, గౌడ 24,200, ముదిరాజ్ 23,220, యాదవ 22,150, మాల 11,100, మాదిగ 35,600, ఎస్టీలు 4,220, నాయీ బ్రాహ్మణ 3,300, రజక 7,600, మైనార్టీ 5,100, ఇతర కూలాల వాళ్లు 12,050 మంది ఉన్నారు. మొత్తంగా బీసీ సామాజిక ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బీసీ సామాజిక వర్గం అభ్యర్థిని బరిలో నింపితే లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇందులో భాగంగా కొండా సురేఖ పేరుతో పాటు మరో ఇద్దరి పేర్లను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. అయితే కొండా సురేఖ ఇక్కడ పోటీ చేయాలంటే కొన్ని షరతులను పెట్టినట్లు సమాచారం. 2023 ఎన్నికల్లోనూ ఇక్కడే టికెట్ ఇవ్వాలని కోరింది. అంతేకాకుండా వరంగల్ అర్భన్, భూపాలపల్లి, పరకాల టికెట్లు తమ వారికే ఇవ్వాలని తెలిపింది. అయితే మిగతా స్థానాలు రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసిన భూపాల పల్లి విషయంలో ఆలోచిస్తానని చెప్పినట్లు సమాచారం.
ఇక కొండా సురేఖను బరిలో ఉంచడం వల్ల తమకు అన్ని విధాలుగా లాభిస్తుందని పార్టీ అధిష్టానం ఆలోచనలో పడింది. కొండా సురేఖ పద్మశాలి వర్గానికి చెందిన వారు. దీంతో ఆ ఓట్లు నియోజకవర్గంలో 26 వేలకు పైగా ఉన్నారు. వాటితో పాటు కొండా మురళి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. అలాగే రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన వారు. ఇలా కులాల వారీగా ఓట్లు లాభిస్తాయని అనుకుంటన్నారు. ఇక రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాత పార్టీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజల్లోనూ కొంత ఆసక్తి వచ్చింది. దీంతో రేవంత్ యూత్ ఫాలోయింగ్ కూడా కలిసివచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
టీఆర్ఎస్ బీసీ అభ్యర్థిని బరిలో ఉంచగా బీజేపీ తరుపున ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. దీంతో ఫలితం సంగతి ఎలాగున్నాపార్టీలో జోష్ పెరిగి ప్రభావం చూపినా పర్వాలేదని భావిస్తున్నారు. ఈ ప్రభావం వచ్చే ఎన్నికలపై కచ్చితంగా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాత మొదటి ఎన్నిక కావడంతో ఆయన దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరి కొండా సురేఖ ఏ మేరకు ప్రభావం చూపనున్నారో చూడాలి.