టీఆర్ఎస్ లో తనకు ఘోర అవమానం ఎదురైందని కొండా సురేఖ వాపోయారు. తాను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 50వేలకు పైగా మెజార్టీతో గెలిచామని..అయినా తనకు టికెట్ ప్రకటించకపోవడం ఏంటని సురేఖ నిలదీశారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరులో మాట్లాడిన కొండా దంపతులు టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. 105మంది జాబితాలో తన పేరు ప్రకటించకపోవడానికి కారణాలేంటని ఆమె ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో చాలాసార్లు తమకు వర్తమానం పంపారని.. అయితే పరకాల సీటు ఇస్తేనే టీఆర్ఎస్ లోకి వస్తామని తాము తేల్చిచెప్పామని అన్నారు. అందుకు కేసీఆర్, కేటీఆర్ అంగీకరిస్తూ తనకు మంత్రి పదవి, కొండా మురళికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు.
వరంగల్ లో తమ వ్యతిరేకులను టీఆర్ ఎస్ పార్టీలోకి తీసుకున్నారని.. ఎర్రబెల్లి దయాకర్ రావు సహా టీడీపీ నేతలను తీసుకొని తమకు కేసీఆర్ చెక్ పెట్టారని కొండా సురేఖ మండిపడ్డారు. వారిని తీసుకున్నాకే తమను దూరం పెట్టారని మండిపడ్డారు. తాను భూపాలపల్లి - వరంగల్ తూర్పు - పరకాల సీట్లు అడిగామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాను వరంగల్ తూర్పుపైనే ఆశలు పెంచుకున్నామన్నారు. భూపాలపల్లి - పరకాల కార్యకర్తలే తమను అక్కడి నుంచి పోటీ చేయాలని కోరారన్నారు. తాము పోటీచేస్తేనే గెలుస్తామని వాళ్లు కోరితేనే అక్కడ సభల్లో పాల్గొన్నామన్నారు.
సీఎం కేసీఆర్ తమపై ఎంతో నిఘా పెట్టారని.. రాహుల్ గాంధీ వచ్చినా.. వేరే అమిత్ షా వచ్చినా ఏ నేతలు వచ్చినా తమ ఫోన్లు - తమ డ్రైవర్ల ఫోన్లపై నిఘా పెట్టారని కొండా సురేఖ విమర్శించారు. తాము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్టు.. కుట్రలు పన్నుతున్నట్టు ఫోన్లు ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు.
తమకు టిక్కెట్ ఇవ్వకుండా హోల్డ్ లో పెట్టడానికి మంత్రి కేటీఆర్ కారణమని కొండా సురేఖ నిప్పులు చెరిగారు. కేటీఆర్ తన భవిష్యత్ రాజకీయాల కోసమే కోటరీ ఏర్పాటు చేసుకుంటున్నారని.. తెలంగాణను ఆగం చేయడానికి వారు కుట్ర పన్నుతున్నారన్నారు. భవిష్యత్ లో సీఎం కావడానికి కేటీఆర్ తనకు అనుకూలమైన నేతలకు టిక్కెట్లు ఇప్పించుకుంటున్నారని సురేఖ బాంబు పేల్చారు. ఈసారి గెలిస్తే తనకు మంత్రి పదవి ఇవ్వడం తప్పనిసరి కావడంతోనే తనలాంటి రెబల్ ఉంటే మంత్రివర్గంలో ఆటలు సాగవనే పొమ్మనలేక పొగ బెడుతూ కుట్రలు పన్నారని సురేఖ అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈసారి ఎన్నికల్లో మూడు సీట్లలో.. లేదంటే రెండు సీట్లలో పోటీచేద్దామనుకున్నామని.. కానీ వరంగల్ తూర్పు ఇచ్చినా తాము ఊరుకునే వాళ్లమని కొండా సురేఖ స్పష్టం చేశారు. కానీ అది ఇవ్వకుండా మా వ్యతిరేకులకు టికెట్లు ఇవ్వడంపైనే తాము గుర్రుగా ఉన్నామన్నారు. టీఆర్ ఎస్ కార్యకర్తలు - నేతలే తమను మూడు సీట్లలో పోటీచేయాలని కోరారన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో మహిళలకు అన్యాయం జరిగిందని.. ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని సురేఖ మండిపడ్డారు. తెలంగాణ సాధనలో మహిళల పాత్రలేదా అని ప్రశ్నించారు.
మంత్రి హరీష్ రావుకు తాము టీఆర్ఎస్ లోకి రావడం ఇష్టం లేకుండేది అని సురేఖ, మురళి బాంబు పేల్చారు. మా రాకను నిరసిస్తూ ఆయన అన్నం కూడా తినకుండా అలిగి వెళ్లిపోయాడని.. కానీ పార్టీలోకి వచ్చాక మాత్రం తమ వెంట ఉన్నది హరీష్ రావేనని వారు స్పష్టం చేశారు. కానీ మంత్రి కేటీఆర్ మాత్రం తమను టీఆర్ ఎస్ లోకి ఆహ్వానించి ఇప్పుడు పొగపెట్టారని సురేఖ విమర్శించారు. తమకు టిక్కెట్లపై మాట్లాడాలని హైదరాబాద్ రమ్మని.. అనంతరం ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకొని కేటీఆర్ తమను అవమానించారని సురేఖ వాపోయారు. తమను టీఆర్ఎస్ నుంచి బయటకు పంపడంలో కేటీఆరే కుట్ర చేస్తున్నారని సురేఖ మండిపడ్డారు.
తాము ఈ ఎన్నికల్లో మూడు స్థానాల్లో పోటీచేస్తామని.. భూపాలపల్లి - వరంగల్ తూర్పు - పరకాల నుంచి అని సురేఖ స్పష్టం చేశారు. ఇంకా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకోలేదని.. త్వరలోనే తమ పార్టీ నేతలు - కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయించుకుంటామన్నారు. అవసరమైతే ఒంటరిగా ఇండింపెండెంట్ గానైనా పోటీ చేస్తామని సురేఖ స్పష్టం చేశారు.