తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీలో నెలకొన్న అంతర్గత అసంతృప్తి కొత్త వార్తలు తెరమీదకు వచ్చాయి. ఒకట్రెండు జిల్లాల్లో పార్టీ నేతల్లో నెలకొన్న అసంతృప్తి తారాస్థాయికి చేరిందని, పార్టీలో ఇమడలేని నేతలు సొంత దారి చూసుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సీనియర్ ఎమ్మెల్యే కొండా సురేఖ పార్టీ వీడనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై సురేఖ క్లారిటీ ఇచ్చారు తాను టీఆర్ ఎస్ ను వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టం చేశారు.
టీఆర్ ఎస్ లోని అంతర్గత పోరును తట్టుకోలేక ఎమ్మెల్యే కొండా సురేఖ - ఆమె భర్త కొండా మురళి దంపతులు టీటిఆర్ ఎస్ ను వీడి సొంతగూడు అయిన కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రచారం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో సురేఖ మీడియాతో మాట్లాడారు. తాను టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని సురేఖ తేల్చి చెప్పారు. తనకు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జన్మనిస్తే, సీఎం కేసీఆర్ పునర్జన్మ ఇచ్చారని ఆమె తెలిపారు. తాను పార్టీని వీడుతున్నట్టు కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమార్తె సుస్మితా పటేల్ తన రాజకీయ వారసురాలని సురేఖ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో సుస్మిత పోటీ చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె వెల్లడించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/