ఎవ‌డ‌బ్బ సొమ్మ‌ని హ‌రికృష్ణ స్మార‌క స్థూపం!

Update: 2018-09-25 09:11 GMT
తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన టీఆర్ఎస్ నేత కొండా సురేఖ.. ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ అనేందుకు సాహ‌సించ‌ని చాలానే వ్యాఖ్య‌లు చేశారు ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన ఎన్టీఆర్ కుమారుడు హ‌రికృష్ణకు స్మార‌క స్థూపం క‌ట్టిస్తాన‌ని ప్ర‌క‌టించిన కేసీఆర్ స‌ర్కారు నిర్ణ‌యాన్ని తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌ట్టారు.

హ‌రికృష్ణ స్మార‌క స్థూపం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం స్థ‌లాన్ని కేటాయించ‌టాన్ని కొండా సురేఖ త‌ప్పు ప‌ట్టారు. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా కేసీఆర్ ప్ర‌క‌టించిన 105 మంది అభ్య‌ర్థుల జాబితాలో కొండా పేరు లేక‌పోవ‌టం.. ఆమెకు టికెట్ ఇచ్చే విష‌యంపై కేసీఆర్ పున‌రాలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా వార్త‌ల నేప‌థ్యంలో తాజాగా ఆమె పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

టీఆర్ఎస్ నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కొండా సురేఖ‌.. తాజాగా కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాల్ని.. పాల‌న‌ను ఆమె తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. పార్టీ టికెట్ ను రిజెక్ట్ చేసిన నేప‌థ్యంలో తీవ్ర మ‌న‌స్తాపంతో ఉన్న ఆమె.. కేసీఆర్ ను ల‌క్ష్యంగా చేసుకొని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా సినీన‌టుడు హ‌రికృష్ణ స్మార‌కాన్ని నిర్మిస్తామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నిర్ణ‌యంపై విమ‌ర్శ‌లు చేస్తూ.. ఏ ప్రాతిప‌దిక‌న స్థ‌లం కేటాయించారు? హ‌రికృష్ణ ఉద్య‌మ‌కారుడా?  కేసీఆర్ కు చుట్ట‌మా?  తెలంగాణ ఉద్య‌మకారుడా?  తెలంగాణ పోరాట యోధుడా?  అమ‌ర‌వీరుల కుటుంబ స‌భ్యుడా? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

హ‌రికృష్ణ మ‌ర‌ణించి కాసేప‌ట్లోనే తండ్రీ కొడుకులు ఇద్ద‌రూ వెళ్లార‌ని.. అంత్య‌క్రియ‌లు పూర్తి అయ్యే వ‌ర‌కూ కేటీఆర్ అక్క‌డే ఉన్నార‌ని.. 450 గ‌జాల స్థ‌లాన్ని స్మార‌క స్థూపం కోసం కేటాయించార‌న్నారు. ఎవ‌డ‌బ్బ సొమ్మ‌ని హ‌రికృష్ణ‌కు తెలంగాణ భూమి ధారాద‌త్తం చేశార‌ని తీవ్రంగా విమ‌ర్శించారు.

తెలంగాణ కోసం పోరాడిన కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ చ‌నిపోతే ప‌రామ‌ర్శించ‌టానికి టైం దొర‌క‌ని కేసీఆర్‌.. మాజీ ముఖ్య‌మంత్రి టి. అంజ‌య్య స‌తీమ‌ణి ఇటీవ‌ల మ‌ర‌ణిస్తే ప‌రామ‌ర్శించ‌టానికి వెళ్ల‌టానికి కూడా టైం దొర‌క‌లేద‌ని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. 
Tags:    

Similar News