కొండా సురేఖ చెప్పిన హైబ్రీడ్‌ జాతి నేత‌లు!

Update: 2018-07-04 06:31 GMT
ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న కొద్దీ రాజ‌కీయం అంత‌కంత‌కూ వేడెక్కిపోతూ ఉంటుంది. తాజాగా అలాంటి సీనే వ‌రంగ‌ల్ లో క‌నిపించింది. ఉన్న సీటు కోసం సిట్టింగులు ప్ర‌యాస ప‌డ‌టం ఒక ఎత్తు అయితే.. స‌ద‌రు సీట్ల కోసం కొంద‌రు ఔత్సాహికులు కొత్త త‌ర‌హాలో ప్ర‌య‌త్నాలు చేయ‌టం మామూలే.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కొస్తున్న కొద్దీ ఇలాంటివి అంత‌కంత‌కూ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే.. వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో కొంద‌రు నేత‌లు వేస్తున్న వేషాల‌పై వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

నేత‌ల్లో ఒరిజిన‌ల్ బ్రీడ్.. హైబ్రీడ్ అంటూ వేరియేష‌న్స్ చెబుతూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ముఖం ప‌గిలేలా మాట్లాడే స‌త్తా ఉన్న కొండా సురేఖ వ‌రంగ‌ల్ లో నిర్వ‌హించిన ఈద్ మిలాప్ పండ‌గ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

త‌న భ‌ర్త.. ఎమ్మెల్సీ అయిన‌ కొండా ముర‌ళీతో క‌లిసి హాజ‌రైన ఆమె మాట్లాడుతూ.. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పుట్టుక‌తోనే రావాల‌న్నారు. కొండా ముర‌ళి ఒరిజిన‌ల్ బ్రీడ్ అని..  వ‌చ్చి రాని వేషాలు వేస్తున్న హైబ్రీడ్ నేత‌ల తీరును స‌హించేది లేద‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. తామీ వేదిక ద్వారా ఆ త‌ర‌హా హైబ్రీడ్ నేత‌ల‌కు వార్నింగ్ ఇచ్చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి సంచ‌ల‌న సృష్టించారు. ఒరిజిన‌ల్ బ్రీడ్ ఎవ‌రో చెప్పిన కొండా సురేఖ‌.. హైబ్రీడ్ నేత‌లు ఎవ‌రో చెప్పేస్తే పోలా?
Tags:    

Similar News