షర్మిల పార్టీపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Update: 2021-03-28 12:35 GMT
తెలంగాణ రాజకీయాల్లోకి దూసుకొస్తున్న వైఎస్ షర్మిలపై విమర్శలు మొదలయ్యాయి. ఒక్కో నేత ఆమెపై కామెంట్ చేయడం మొదలైంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ నేత కొండా విశ్వేశవ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ షర్మిల కొత్త పార్టీపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.షర్మిల పార్టీలో చేరే ప్రసక్తే లేదని.. షర్మిల పార్టీ తెలంగాణ వ్యతిరేకి అని కొండా పేర్కొన్నారు. షర్మిల పెట్టేది ఆంధ్రా పార్టీగా.. ఆమె ఆంధ్రా నాయకురాలిగానే కొండా గుర్తించినట్టు అయ్యింది.

కాంగ్రెస్ ను వీడి 10 రోజులైందని.. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినట్టు కొండా వాపోయారు. కేసీఆర్ మూడేళ్లు వెంటపడితే రాజకీయాల్లోకి వచ్చామని.. తాను అనుకున్నంత మార్పు కేసీఆర్ తీసుకురాలేకపోయారని అన్నారు.

తెలంగాణ ఆర్థికంగా వెనక్కిపోయిందని.. కాగ్ నివేదిక కూడా ఇదే విషయాన్ని బయటపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు మరో ప్రాంతీయ పార్టీ అసవరం ఉందని.. అయితే రీజినల్ పార్టీలు ఎక్కువైతే దాని వలన టీఆర్ఎస్ పార్టీకే లాభం ఉంటుందని అన్నారు.




Tags:    

Similar News