విజ‌య‌సాయిరెడ్డి నియామ‌కం చెల్ల‌దంటున్నాడు!

Update: 2019-06-03 08:45 GMT
ఒలంపిక్ అసోసియేష‌న్ ఛైర్మ‌న్ గా రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డిని నియ‌మిస్తూ ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యంపై కొత్త వాద‌న‌లు వినిపిస్తున్నారు ఏపీ ఒలంపిక్ అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి కేపీ రావు. ఒలంపిక్ సంఘం రెండు వ‌ర్గాలుగా ఏర్ప‌డి అనేక ఒత్తిళ్ల‌కు గురైంద‌న్నారు.

ఒలంపిక్ సంఘం ఎన్నిక‌లను గుర్తింపు పొందిన సంఘాల‌తో నిర్వ‌హించామ‌ని.. గ‌త ప్ర‌భుత్వంలో గుర్తింపు లేని సంఘాల‌కు ఎన్నిక‌ల్లో పాల్గొనే అవ‌కాశం క‌ల్పించిన‌ట్లుగా వారు చెబుతున్నారు. కేపీ రావు వాద‌న ఏమంటే.. ఒలంపిక్ సంఘం స‌భ్యుడైన పురుషోత్తం 2015లో కొత్త సంఘాన్ని.. సొసైటీని ఏర్పాటు చేసి రిజిస్ట్రేష‌న్ చేయించార‌ని.. రూల్స్ ప్ర‌కారం ఈ రిజిస్ట్రేష‌న్ ఏపీలో చేయాల్సి ఉంద‌న్నారు. కానీ.. రిజిస్ట్రేష‌న్ చెన్నై చిరునామాతో ఉంద‌న్నారు.

కోర్టు ఉత్త‌ర్వులు మేర‌కు పురుషోత్తం రిజిస్ట్రేష‌న్ చేయించిన సంఘం చెల్ల‌ద‌ని.. దానికి గుర్తింపు ఉంద‌ని ఆయ‌న చెప్పారు. గ‌త ప్ర‌భుత్వాన్ని కూడా ఇదే రీతిలో త‌ప్పుదారి ప‌ట్టించార‌ని.. ఇప్పుడు కూడా అదే ప‌ని చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

నిబంధ‌న‌లు పాటించ‌కుండా లేని ప‌ద‌వి సృష్టించి విజ‌య‌సాయిరెడ్డిని ఛైర్మ‌న్ గా నియ‌మించ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న వాపోతున్నారు. రూల్స్ ను పాటించ‌కుండా విజ‌య‌సాయిని నియ‌మించ‌టం స‌రికాద‌ని.. సంఘంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌ను ప‌రిశీలించి.. స‌రి చేయాల‌ని కోరుతున్నారు. లింపిక్ సంఘం ఎన్నికపై న్యాయ పరమైన పోరాటం చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌రి.. ఈ వివాదంపై విజ‌య‌సాయి ఏమంటారో చూడాలి.
Tags:    

Similar News