రెబల్ స్టార్ - కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు గవర్నర్ పదవి దక్కనుంది. తమిళనాడు గవర్నర్ గా ఆయన పేరు ఖరారైంది--ఇది గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రసారం అవుతున్న వార్త. దీనిపై ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు అధికార బీజేపీ కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ కొందరు మాత్రం ఈ వార్తను వైరల్ గా మార్చేశారు. కృష్ణంరాజుకు గవర్నర్ గిరీ కట్టబెట్టడంలో ఇంకా స్పష్టత రానప్పటికీ మరో ఇద్దరు సీనియర్ నేతల పేర్లు మాత్రం గవర్నర్ పదవి విషయంలో తెరమీదకు వచ్చాయి.
బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషీకి తమిళనాడు గవర్నర్ గా పంపేందుకు బీజేపీ పెద్దలు సిద్ధమయ్యారట. తాజాగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు జోషీ వద్ద ప్రతిపాదించగా ఆయన నో చెప్పారట. బీజేపీ ఉద్ధండులైన అటల్ బిహారీ వాజ్ పేయి - ఎల్ కే అద్వానీ సమకాలికుడైన మురళీమనోహర్ జోషీ గతంలో కేంద్ర మంత్రిగా కీలక శాఖలకు బాధ్యత వహించిన అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి గవర్నర్ గిరీని వద్దనుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదని అంటున్నారు. కాగా బీజేపీకి చెందిన తెలంగాణ నాయకుడు ఒకరి పేరు గవర్నర్ గిరీ కోసం ఢిల్లీలో పరిశీలనలో ఉందంటున్నారు.రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన ఈ నాయకుడు అది దక్కకపోవడంతో గవర్నర్ సీటు కోసం పరిశీలించాలని ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/