తెలుగోళ్లకు మరీ ముఖ్యంగా ఆంధ్రోళ్లకు బీజేపీ అన్యాయం చేసిందా? అంటే.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిఒక్కరూ అవుననే చెబుతారు. కాకపోతే కరుడుకట్టిన కమలనాథులు తప్ప. పార్టీ కంటే ప్రజలే ఎక్కువని అనుకుంటారని భావించిన రెబల్ స్టార్.. తాను పార్టీకి వీర విదేయుడినన్న విషయాన్ని తాజాగా స్పష్టం చేశారు. కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఆయన కర్ణాటకకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్రంలోని మోడీ సర్కారు ఇమేజ్ డ్యామేజ్ చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు ధ్వజమెత్తిన కృష్ణంరాజు.. ఆంధ్రోళ్లకు బీజేపీ ఎలాంటి అన్యాయం చేయలేదన్నారు. తన తప్పుల్ని కప్పి పుట్టుకోవటానికి బాబు మోడీ సర్కారుపై ప్రచారం చేస్తున్నారన్నారు.
నిజమే.. బాబు తప్పులు చేయలేదని ఎవరూ చెప్పటం లేదు. కానీ.. ఏపీ ప్రయోజనాలు నెరవేర్చేలా మోడీ సర్కారు వ్యవహరించలేదన్నది వాస్తవం. హోదా విషయంలో మోడీ ఇచ్చిన థోకా సంగతేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి. మరోసారి అధికారంలోకి రావాలన్న కోరికతోనే కేంద్రపై విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పిన కృష్ణంరాజు మాటలు చూస్తుంటే.. మోడీని పల్లెత్తు మాట అనేందుకు సైతం సిద్ధంగా ఆయన లేరని స్పష్టమవుతోంది. తన ప్రచారంలో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఏపీకి బీజేపీ అన్యాయం చేయలేదని.. ప్యాకేజీలో భాగంగా ఇస్తామని చెప్పిన ఎన్నో అంశాల్ని పూర్తి చేశారని.. మిగిలిన వాటిని చేస్తున్నారన్నారు. కొన్ని అంశాలు ఆలస్యమై ఉండొచ్చని.. నిరసనలు చేయటం సరికాదన్నారు. ఇందుకు బాబు సర్కారు కూడా కారణం కావొచ్చరన్నారు.
ఇక.. కర్ణాటకలో సిద్దరామయ్య సర్కారుపై వ్యతిరేకత లేదని చేస్తున్న వాదనలో నిజం లేదని.. అలాంటివన్నీ అబద్ధాలేనన్నారు. అవినీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం నెంబర్ వన్ గా నిలుస్తోందన్నారు. కృష్ణంరాజు తాజా వ్యాఖ్యలు చూస్తుంటే.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ శ్రేయస్సు తప్పించి.. ప్రజల గురించి ఎంతమాత్రం ఆలోచించటం లేదన్న విషయం స్పష్టమవుతుందని చెప్పాలి. తెలుగోళ్లంతా ముద్దుగా పిలుచుకునే రెబల్ స్టార్ పేరు కోసమైనా.. ఏపీ హోదా విషయంలో జరిగిన అన్యాయంపై రెబల్ గా రియాక్ట్ కావాల్సింది పోయి.. మిగిలిన నేతల మాదిరి ఏపీ ప్రజల ఆశల్ని.. ఆకాంక్షల్ని.. కలల్ని కల్లలు చేసేలా వ్యాఖ్యలు చేయటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.