అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్నాచెల్లెళ్లు ఇద్దరూ బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రత్యర్థి వర్గాల మీద విరుచుకుపడుతుననారు. గతంలో అన్నసభలు అన్నవి.. చెల్లెమ్మ సభలు చెల్లెమ్మవి అన్నట్లు ఉండేవి. కానీ.. ఈ మధ్యన రూట్ మారింది. అధినేత కమ్ తండ్రి పరోక్షంలో భారీ ఎత్తున బహిరంగ సభల్ని నిర్వహిస్తూ.. తనసత్తాను చాటటమే కాదు.. కుటుంబంలో తనకున్న మద్దతు గురించి అందరికి అర్థమయ్యేలా చేస్తున్నారు కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్.
త్వరలోనే తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ కు కీలక బాధ్యతల్ని కేసీఆర్ అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. కేటీఆర్ నిర్వహిస్తున్న జనహిత ప్రగతి సభలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా జగిత్యాలలో నిర్వహించిన సభలో అన్నాచెల్లెళ్లు ఇద్దరూ మరోసారి ఒకే వేదిక మీద తళుక్కుమన్నారు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ..సంక్షేమ కార్యక్రమాల్లో తమ ప్రభుత్వం ఎంతలా దూసుకువెళుతుందన్న విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తమ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో మండిపడిన అన్నాచెల్లెళ్లు.. పదునైన విమర్శలతో పాటు.. పిట్టకథల్ని చెప్పి ప్రజల మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేశారు.
తమ రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ ను ఎటకారం చేసుకుంటూ.. ఎవరి శక్తి కొలది వారు పిట్టకథల్ని చెప్పటం గమనార్హం. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని.. ఇక దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న కేటీఆర్.. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులుగా మారే కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కేటీఆర్.. ఓ పిట్టకథను చెప్పి ఆకట్టుకున్నారు. మిషన్ కాకతీయపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొడుతూ.. ఇటీవల జీవన్ రెడ్డి మరికొందరు నేతలు పెగడపల్లి మండలం వెంగళాయిపేట చెరువు వద్దకు వెళ్లారని.. నీళ్లతో నిండిన చెరువు చుట్టూ వారు తిరుగుతుండగా ఓ చేప పిల్ల వారిని చూసి.. అమ్మా.. వాళ్లు ఎవరంటూ తన తల్లిని అడిగిందని.. తెలీదని సమాధారం రావటంతో తండ్రి వద్దకు వెళ్లిన ఆ చేపపిల్ల అదే ప్రశ్నను అడిగిందన్నారు. దీనికి తండ్రి చేప బదులిస్తూ.. మనం పిష్.. వాళ్లు సెల్ఫిష్ అని చెప్పిందంటూ ఎటకారం చేసేశారు. అన్నకు తగ్గ చెల్లెలుగా కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడిన ఎంపీ కవిత.. తనదైన శైలిలో పిట్టకథను చెప్పుకొచ్చారు.
గతంలో ఓ ముసలి పులి చేతిలో బంగారు కడెంతో దారిలో ఉండి అందరికీ ఆశ చూపి దగ్గరికి పోయిన వారిని చంపి తినేదని.. జీవన్ రెడ్డి ఆ ముసలి పులిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చూస్తుంటే.. తమపై విమర్శలు చేస్తున్న వారిపై అన్నాచెల్లెళ్లు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్న తీరు గమనించాల్సిన అంశంగా చెప్పాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/