ఇదే బెస్ట్ గిఫ్ట్ అంటున్న కేటీఆర్

Update: 2017-03-26 09:55 GMT
ఎప్పుడూ గంభీరంగా కనిపించే తెలగాణ ముఖ్యమంత్రి ఈ మధ్య తన ముద్దుల మనవడు హిమాన్షును ఆప్యాయంగా ముద్దాడుతున్న ఫొటో ఒకటి మీడియాలో హల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫొటో మరోసారి వార్తల్లోకి వచ్చింది. కేసీఆర్ తన మనవడిని ముద్దాడుతున్న ఫొటోను ఆర్ట్ లాగా వేయించి.. ఫ్రేమ్ కట్టించి ఆ పిల్లాడి తండ్రి అయిన కేటీఆర్ కు బహుమతిగా ఇచ్చారు. దీన్ని తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు కేటీఆర్. తాను ఇప్పటిదాకా అందుకున్న బెస్ట్ గిఫ్ట్ ఇదే అని కేటీఆర్ తెలిపాడు. ఈ ఫొటో ట్విట్టర్లో వైరల్ అయింది. దీనికి బోలెడన్ని లైకులొచ్చాయి. వేలమంది రీట్వీట్ చేశారు.

కేసీఆర్ పేరెత్తగానే ఒక ఉద్యమ నేతగా.. గొప్ప ప్రసంగీకుడిగా.. ముఖ్యమంత్రిగానే కనిపిస్తాడు. కానీ ఆయనలోని మరో కోణాన్ని చూపించే ఫొటో ఇది. కేసీఆర్ కుటుంబానికి చాలా ప్రాధాన్యమిస్తాడు. తన మనవడి దగ్గర ఆయన కూడా చిన్న పిల్లాడైపోతాడని ఈ ఫొటో చూస్తే అర్థమవుతుంది. కేసీఆర్ ఇలా కనిపించడం అరుదు. గత ఏడాది ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అదిరిపోయే స్పీచ్ తో వెలుగులోకి వచ్చాడు హిమాన్షు. ఆ స్పీచ్ చూశాక హిమాన్షు కూడా తండ్రి.. తాతల్లాగే మంచి స్పీకర్ అవుతాడనిపించింది అందరికీ. ఇటీవలే ఇండియా-బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చిన హిమాన్షు.. అక్కడ తన స్నేహితులతో కలిసి సందడి చేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News