ఎన్డీటీవీ-అదానీ డీల్ పై కేటీఆర్ సెటైర్లు

Update: 2022-08-24 08:35 GMT
మోడీకి బెస్ట్ ఫ్రెండ్.. ప్రపంచంలోనే టాప్ 4 ధనవంతుడు అయిన గౌతం అదానీ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇస్తూనే దేశంలోనే టాప్ జాతీయ చానెల్ ఎన్డీటీవీలో 29శాతం వాటాలు కొనేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది.  ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. భారత బడా బిలియనీర్ గౌతం అదానీ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

దేశంలోని టాప్ ఛానెళ్లలో ఒకటైన ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను అదానీ గ్రూప్ కొనేసింది. మరో 26 శాతం వాటాను కొనేందుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. కొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

అదానీ ఎంటర్ ప్రైజెస్ అనుబంధ సంస్థ ఏఎంఎన్ఎల్ ఈ వాటాను కొనుగోలు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయబోతోందన్న వార్త జాతీయ స్థాయిలో హాట్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకూ బీజేపీకి అనుకూలంగా లేని మీడియా సంస్థగా ఎన్డీటీవీకి పేరుంది. ఇప్పుడు అదానీ కొనడంతో బీజేపీ వశం కానుంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ రెచ్చిపోయారు. అదానీ-ఎన్డీటీవీ డీల్ విషయంలో తనదైన శైలిలో స్పందించారు. మోడీ లక్ష్యంగా ట్వీట్ చేశారు. దేశంలో మీడియా 'మోడియా'గా మారిపోతుందంటూ సెటైర్ వేశారు కేటీఆర్. 'రిప్ ఇండిపెండెంట్. మీడియా లేదా మనం ఇప్పుడు దానిని మోడియా' అని పిలవాలి. దేశంలో పూర్తి సమాచార శూన్యతను సృష్టించడానికి మరియు.. భారతదేశాన్ని ఏకీకృత రాష్ట్రంగా అమలుచేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విషయం తెలిసిందే. ఆయన ఎక్కువగా ట్విట్టర్ ను ఫాలో అవుతూ పలు సమస్యలపై స్పందిస్తూ ఉంటారు. ఇదే తరుణంలో బీజేపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.  కమర్షియల్ ఎల్పీజీ ధరను ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో ఓపోస్టును పెట్టారు. దీనికి  ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ అని పేర్కొంటూ 'అచ్చేదిన్ ఏప్రిల్ పూల్స్ డేస్' అని  వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఎన్డీటీవీ-అదానీ డీల్ పై బీజేపీ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ సంచలన ట్వీట్స్ చేశారు.

కొద్ది రోజులుగా రకరకాల పోస్టులతో కేటీఆర్ తనదైన శైలిలో బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Tags:    

Similar News