మీడియా ప్రతినిధులకు పెద్ద పరీక్షగా మారింది టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యవహారం. ఒక రోజు ఏపీ వార్తలు ఎందుకు వేస్తున్నారు. తెలంగాణ పత్రికలో ఏపీ వార్తలా? అని ప్రశ్నిస్తారు. మళ్లీ.. నెల గడిచిన తర్వాత అదే ఏపీకి సంబంధించిన అంశాల్ని మాట్లాడతారు. పెద్దసారు తర్వాత అంతటోడైన చిన్నసారు చెప్పింది చెప్పినట్లుగా చేద్దాం.. అనవసరంగా కోపం తెప్పించొద్దని డిసైడ్ అయితే.. మీరిలా మాట మార్చేస్తే ఎలా సార్?
ఒకవైపు ఏపీ వార్తలు వేయొద్దని చెబుతూనే.. మరోవైపు ఏపీ పాలిటిక్స్ మాట్లాడితే ఏమని అర్థం చేసుకోవాలి కేటీఆర్ సర్. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ముక్తసరిగా తెలంగాణ గురించి మాట్లాడిన కేటీఆర్.. ఆ తర్వాత ఏపీ గురించి అంత ఎక్కువగా మాట్లాడటం చూస్తే.. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటానికా? అన్న డౌట్ రాక మానదు.
ఇంతకీ ఏపీ రాజకీయాల గురించి కేటీఆర్ ఏం మాట్లాడారంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసేశారు. రాష్ట్ర అధికారులను ఎన్నికల సంఘం మారిస్తే బాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించిన కేటీఆర్.. ప్రజల పట్ల నమ్మకం లేకనే ఢిల్లీలో వీధి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
ప్రజాతీర్పును స్వాగతించాలని కానీ చంద్రబాబు మాదిరి గగ్గోలు పెట్టొద్దన్నారు. తాను గెలిస్తే సాంకేతికత భేష్ అని.. లేకుంటే ఈవీఎంలు తప్పు అని బాబు అనటం సరికాదన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తి మరీ ఇంత చిల్లర అరుపులు ఎందుకు అరుస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. వంగి వంగి దండాలు పెట్టినప్పుడే బాబు పని అయిపోయిందని అందరికి అర్థమైందన్నారు. అయినా.. ఢిల్లీలో చంద్రబాబు ఏదో చేస్తుంటే.. తెలంగాణకు ఏ మాత్రం సంబంధం లేని కేటీఆర్ ఎందుకు ఫీల్ అవుతున్నట్లు? అయినా.. ఇలాంటి మాటలు మాట్లాడాల్సింది ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా? కేటీఆర్ ఎందుకు రియాక్ట్ అవుతున్నట్లు చెప్మా?