తెలంగాణ రాష్ర్ట సమితి భవిష్యత్ ముఖ్యమంత్రుల రేసులో ఉన్న రాష్ర్టమంత్రులు, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు అయిన తన్నీరు హరీశ్ రావు, కల్వకుంట్ల తారకరామారావుల గురించి ఓ నిజం వెలుగులోకి వచ్చింది. అదికూడా వారిద్దరు పోటీ గురించి! తాను హరీశ్ తో పోటీపడుతున్నానని స్వయంగా కేటీఆర్ ప్రకటించారు. ఇంతకీ ఈ ఆసక్తికరమైన స్టేట్ మెంట్ ఎందుకు చేశారంటే...తమ ఇద్దరికి పోలిక ఉండటం వల్లేనని స్పష్టం చేశారు
సిరిసిల్ల నియోజకవర్గాన్ని వంద శాతం మరుగుదొడ్లు గల నియోజకవర్గంగా తీర్చి దిద్దిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు. సిరిసిల్ల స్వచ్చ్ పట్టణంగా ఏర్పాటయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలు, సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేస్తామని ఆశించామని కానీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వారు చేసిందేమీ లేదని తెలిపారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి జానెడు సూచన చేయలేదన్నారు. చిన్నారెడ్డి చిన్న సలహా ఇవ్వలేదని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏవో నాలుగు ఉత్తమ మాటలు చెబుతాడనుకుంటే ఆయన కూడా ఏమీ చెప్పకుండానే విమర్శలు చేశాడని తెలిపారు. మర్యాద ఇస్తే పుచ్చుకోవాలి కానీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా విమర్శించడం సరికాదన్నారు.
60 ఏళ్ల దరిద్రాన్ని తొలగించడానికి తప్పకుండా కొంత సమయం పడుతుందని కేటీఆర్ తెలిపారు. రైతులను ధీన స్థితిలోవదిలి వెళ్లింది ప్రతిపక్షాలు కాదా? అని నిలదీశారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వంలోని మంత్రుల మధ్యే పోటీ ఉందని...మరోమంత్రి హరీశ్ రావు తో తాను అభివృద్ధిలో పోటీ పడుతున్నానని చెప్పారు. ఆరోగ్యకరమైన పోటీ ఉండటంలో తప్పేమీ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.