కేటీఆర్ మామ‌కు ప్ర‌భుత్వ వ్య‌తిరేక నిర‌స‌న‌!

Update: 2016-10-19 05:59 GMT
కొత్త జిల్లాలు -రెవెన్యూ డివిజ‌న్ల ఏర్పాటు తాలుకు నిర‌స‌న ఘాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు వియ్యంకుడు - ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌ కు స్వయాన మామ అయిన పాకాల హరినాథరావుకు త‌గిలింది. కేసీఆర్ సొంత ఇలాకా అయిన మెదక్ జిల్లా రామాయంపేటలో అఖిలపక్షం నాయకులు కేటీఆర్ మామ వాహ‌నాన్ని అడ్డుకున్నారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈక్రమంలో  ముఖ్యమంత్రి వియ్యంకుడు హరినాథరావు అతని స్వగ్రామం మండలంలోని దామరచెర్వు గ్రామానికి వస్తున్నాడన్న సమాచారంతో అఖిలపక్షం నాయకులు - గ్రామస్థులు రామాయంపేటలో ఆయన కాన్వాయ్‌ను అడ్డుకొని అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొంత ఉద్రిక్తతకు దారితీసింది.

అయితే కేటీఆర్ మామ‌ హరినాథరావు కారు దిగి దీక్షా శిబిరం వద్దకు చేరుకొని దీక్షలు చేస్తున్న యాదవ సంఘం సభ్యులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట 1955లోనే ఓ వెలుగు వెలిగిందన్నారు. నూతన జిల్లాలు - రెవెన్యూ డివిజన్లు - మండలాల ఏర్పాటు సమయంలో కొంతమంది నేతలు అడ్డు చెప్పడంవల్లే డివిజన్ ఏర్పాటు ఆగి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తూనే వారి సహకారం కూడా అవసరం ఉందన్నారు. ఇప్పటికి డివిజన్ విషయంలో చర్చలు జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ సాధనకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలనలో రామాయంపేట డివిజన్ ఫైల్ ఉందని కేటీఆర్ మామ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా 21 జిల్లాలను పెంచి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచాడని ఆయన ముఖ్యమంత్రిని ఆయ‌న‌ కొనియాడారు. మంత్రి కేటిఆర్ విదేశాలనుంచి వచ్చిన తరువాత డివిజన్ సాధనకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. సాధ్యంకాని పక్షంలో డివిజన్‌ కు దీటుగా అబివృద్ది చేయాలని కోరుతామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News