"ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ర్టాలంటే ఎందుకు పట్టదు? తెలుగు రాష్ర్టాలకు బీజేపీ ఏం చేసిందో ఆ పార్టీ నేతలు చెప్పాలి. బీహార్ కు లక్షా 65వేల కోట్ల రూపాయల ప్యాకేజీ, జమ్ముకశ్మీర్ కు 80 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. కానీ తెలుగు రాష్ర్టాల పట్ల ఎందుకింత వివక్ష చూపుతున్నారు? అమరావతి శంకుస్థాపనకు వెళ్లి మట్టీ-నీరు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కోసం మట్టినైనా ఇచ్చారు. కానీ తెలంగాణకు అదికూడా లేదు. ఆఖరుకు ప్రధానమంత్రి హోదాలో పర్యటించాలని గుర్తుకురాలేదా?" తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తారకరామారావు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆయన నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై కురిపించిన ప్రశ్నల వర్షం ఇది.
నూతన సంవత్సరం సందర్భంగా పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ లో విలేకరులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించిన కేటీఆర్ ఈ క్రమంలో పాలిటిక్స్ మాట్లాడుతూ... కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. రాష్ర్టాలకు కేంద్రం తరఫున న్యాయంగా దక్కాల్సిన నిధులు ఇచ్చి ప్రచారం చేసుకోవడం అంటే 'తెలంగాణకు నేను ప్రధానిని కాకున్నా నిధులు ఇచ్చా' అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పినట్లా అంటూ సెటైర్ వేశారు. మోడీ తెలంగాణ రాష్ర్టానికి వచ్చి తమకు కూడా నిధులు ఇస్తే విమర్శలు చేయబోమని పైగా ఘనంగా సన్మానిస్తామని కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మోడీ మానసపుత్రిక స్వచ్ఛభారత్ ను తెలంగాణ రాష్ర్టం స్థాయిలో బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు ఎవరైనా చేశారా అనేది బీజేపీ నాయకులు ఆలోచించుకోవాలన్నారు. కేంద్రంతో సఖ్యత ఉండవద్దని తమకేమీ లేదని అయితే కేంద్రం పెద్దలు చేస్తున్నది గమనించాలని మాత్రమే కోరుతున్నామని చెప్పుకొచ్చారు.
ఒకవేళ తెలంగాణకు నిధులు ఇవ్వవద్దని అనుకుంటే అంటే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు "నయాపైస ఇవ్వం' అని ప్రకటించండి. ప్రజలు తర్వాతి నిర్ణయం తీసుకుంటారు" అంటూ కేంద్రాన్ని ఇరకాటంలో పడేశారు. మొత్తానికి బీజేపీ లక్ష్యంగానే గ్రేటర్ ఎన్నికలకు పోతున్నట్లు కేటీఆర్ చెప్పకనే చెప్పారు.