సహజంగా మీడియా విషయంలో ఆచితూచి వ్యవహరించే తెలంగాణ మంత్రి కేటీఆర్ తాజాగా జరిగిన ఓ ఘటనపై అసహనం వ్యక్తం చేశారు. చిన్నపాటి క్లాస్ కూడా తీసుకున్నారు. మీడియా ఛానళ్లు ప్రభుత్వానికి, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వార్తా కథనాలు ప్రసారం చేసేముందు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
వివరాల్లోకి వెళితే...వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్ లోని పోలీసులు కన్నారెడ్డి - శేఖర్ రెడ్డి అనే యువకులను చితకబాదారు అంటూ టీవీ9 - ఎన్టీవీ ఛానళ్లు ఓ వీడియోను ప్రసారం చేశాయి. దీనిపై కేటీఆర్ ఆరాతీయించగా అసలు ఆ వీడియోకు తెలంగాణ పోలీస్ కు సంబంధమే లేదని తేలింది. అది రాజస్థాన్ లో జరిగిన ఘటన అని సమాచారం వచ్చింది. అదే సమయంలో యూట్యూబ్ లో ఉన్న టీవీ9 కథనాన్ని ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. మంత్రి స్పందిస్తూ విచారణ జరపాల్సిందిగా డీజీపీని కోరారు. పోలీసులు ఆ వీడియోను పరిశీలించి అది సరైంది కాదని తేల్చారు. దీంతో మళ్లీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో సదరు మీడియా ఛానళ్ల గురించి ట్వీట్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే కథనాలు మీడియా ప్రసారం చేయొద్దని కోరారు. ప్రభుత్వానికి, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వార్తా కథనాలు ప్రసారం చేసేముందు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలని చురక అంటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/