కేటీఆర్ కు న‌చ్చ‌ని ఒకే ఒక్క ప‌దం అదే!

Update: 2018-07-26 17:03 GMT
తెలంగాణ‌లో మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్స్ లో కేటీఆర్ ఒక‌రు. యువ‌నేత‌ల‌తో పాటు సీనియ‌ర్ల‌ను కూడా క‌లుపుకొని పోతోన్న కేటీఆర్ నాలుగేళ్ల కాలంలోనే తెలంగాణ‌లోని కీల‌క‌నేత‌ల్లో ఒక‌రిగా నిలిచారు. అయితే, ఈ మ‌ధ్య కాలంలో కేటీఆర్ కు ఓ ప‌దం అస్స‌లు న‌చ్చ‌డం లేదట‌. త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తోన్న నేత‌లు....ప‌దే ప‌దే ఆ ప‌దాన్ని ఉప‌యోగించ‌డంతో ఆయ‌న మండిప‌డుతున్నార‌ట‌. ఆ మాట చెప్పి కాకా ప‌డ‌దామ‌నుకుంటోన్న నేత‌ల‌కు కేటీఆర్ చివాట్లు పెట్టార‌ట‌. దీంతో, కేటీఆర్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేద్దామ‌నుకున్న నేత‌లు...అక్షింత‌లు వేయించుకొని వ‌స్తున్నార‌ట‌. త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వారు.....త‌న‌ను కాబోయే సీఎం అని సంబోధించ‌డం కేటీఆర్ కు అస‌లు న‌చ్చ‌డం లేద‌ట‌. కేటీఆర్ ను ప్ర‌స‌న్నం చేసుకుందామ‌నుకున్న వారు భంగ‌ప‌డ‌తున్నార‌ట‌. ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల్లో ఈ మ్యాట‌ర్ హాట్ టాపిక్ అయింది.

2014లో తెలంగాణ‌లో టీఆర్ ఎస్ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత సీఎం కేసీఆర్ త‌న‌యున‌కు కేటీఆర్ ఐటీ - పంచాయతీరాజ్ శాఖ‌ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. రెండు శాఖ‌ల‌ను బ్యాలెన్స్ చేస్తోన్న కేటీఆర్....నాలుగేళ్ల‌లోనే బాగా పాపుల‌ర్ అయ్యారు. ఇవాంకా ట్రంప్ ప‌ర్య‌ట‌న‌లో ఆక‌ట్టుకున్న కేటీఆర్ ను ...మోదీ త‌న ప‌క్క‌న కూర్చోబెట్టుకోవ‌డం తెలిసిందే. త్వ‌ర‌లో కేసీఆర్ ....జాతీయ రాజ‌కీయాల‌వైపు దృష్టి సారిస్తోన్న నేప‌థ్యంలో....కాబోయే సీఎం  అంటూ కొంద‌రు నేత‌లు కేటీఆర్ ను ప్ర‌స‌న్నం చేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే, కేటీఆర్ కు ఆ ఒక్క‌మాట అస‌లు న‌చ్చ‌డం లేద‌ట‌. దీంతో, త‌న‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి వ‌చ్చిన వారికి క్లాస్ పీకుతున్నార‌ట‌. 2019లో కేసీఆర్ నేతృత్వంలో  మ‌రోసారి విజ‌యం సాధిస్తామ‌ని...ఆయ‌నే సీఎం...అని కేటీఆర్ గ‌ట్ట‌గా చెప్పార‌ట‌. ఒకేసారి సీఎం కావాల‌ని త‌న‌కు లేదని....స‌మ‌ర్థుడైన నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి సీఎం కావాలని కేటీఆర్ ఆ నేత‌ల‌తో అన్నార‌ట‌. దీంతో, తాజాగా కేటీఆర్ కు బ‌ర్త్ డే విషెస్ చెప్పేందుకు వెళ్లిన నేత‌ల‌కు ....గ‌తంలో చీవాట్లు తిన్న నేత‌లు  స్మూత్ వార్నింగ్ కూడా ఇచ్చార‌ట‌.


Tags:    

Similar News