ఐరన్ మ్యాన్ 70.3 ఛాలెంజ్... ఈ బీజేపీ ఎంపీ ఫిట్ నెస్ వేరే లెవెల్!

ఈ ఘనతపై నేరుగా ప్రధాని మోడీ కూడా స్పందించి, ప్రశంసలు కురిపించారు.

Update: 2024-10-28 10:19 GMT

వయసుతో, ప్రొఫెషన్ తో సంబంధం లేకుండా అందరు ఫిట్ నెస్ పై దృష్టిసారించాలని.. అంతా ఫిట్ గా, హెల్తీ గా ఉండటానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐరన్ మ్యాన్ గా నిలిచారు బీజేపీ ఎంపీ. ఈ ఘనతపై నేరుగా ప్రధాని మోడీ కూడా స్పందించి, ప్రశంసలు కురిపించారు.


అవును... 2022 రిలే ఈవెంట్ లో 90 కి.మీ. సైక్లింగ్ సెగ్మెంట్ ను పూర్తి చేసి ఐర్యన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చారు బీజేపీ నేత, బెంగళూరు సౌత్ కు చెందిన లోక్ సభ ఎంపీ తేజస్వీ సూర్య. ఈ క్రమంలో తాజాగా గోవాలో జరిగిన ఐర్యన్ మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ ఛాలెంజ్ ను పూర్తి చేశారు. దీంతో... ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసిన తొలి పార్లమెంటేరియన్ గా నిలిచారు.


ఈ ఈవెంట్ లో 90 కిలోమీటర్ల సైక్లింగ్, 21.1 కిలోమీటర్ల పరుగు, 1.9 కిలోమీటర్ల ఈత పోటీల్లో ఆయన పాల్గొన్నారు. ఇందులో 57 దేశాల నుంచి 1,200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన సూర్య.. తన ఫిట్ భారతీయ యువకుల ఫిట్ నెస్ లక్ష్యాలన్ను సాధించేలా ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.


ఈ ఘనత సాధించడం కోసం సుమారు నాలుగు నెలలు శ్రమించినట్లు ఎంపీ తెలిపారు. ఇదే సమయంలో... "ఫిట్ నెస్ సంబంధిత కార్యకలాపాలను కొనసాగించడానికి ఇది చాలా మంది యువకులకు స్ఫూర్తినిస్తుంది అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ తేజస్వీ సూర్యపై ప్రశంసలు కురిపించారు.


గోవాలోని సుందరమైన మిరామార్ బీచ్ లో జరిగిన ఈ మొత్తం ఈవెంట్ ను ఎంపీ తేజస్వీ సూర్య 8 గంటల 27 నిమిషాల 32 సెకన్లలో పూర్తి చేశారు. ఇక, ఈ ఈవెంట్ లో పురుషుల టైటిల్ ను ఇండియన్ ఆర్మీకి చెందిన బిస్వర్జిత్ సాయిఖోం 4 గంటల 32 నిమిషాల 4 సెకన్ లలో పూర్తి చేసి పురుషుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు.

ఇదే సమయంలో... 5 గంటల 22 నిమిషాల 50 సెకన్లలో ఈజిప్ట్ క్రీడాకారిణి యాస్మిన్ హలవా పూర్తి చేసి మహిలా విభాగంలో అగ్రస్థానంలో నిలిచారు.

Tags:    

Similar News