రీల్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ సస్పెన్షన్... లోకేష్ ఇంట్రస్టింగ్ ట్వీట్!

ఫలితంగా ఫ్యాన్స్ ని, ఫాలోయింగ్ ని సంపాదిస్తూ.. నెట్టింట ఫేమస్ అయ్యే పనులు కూడా చేస్తుంటున్నారు.

Update: 2024-10-28 06:49 GMT

ఇటీవల కాలంలో వృత్తి, ప్రవృత్తితో సంబంధం లేకుండా చాలా మంది వారి వారి పనులతో పాటు.. గ్యాప్ దొరికితే మధ్య మధ్యలో రీల్స్ చేసుకుంటూ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా ఫ్యాన్స్ ని, ఫాలోయింగ్ ని సంపాదిస్తూ.. నెట్టింట ఫేమస్ అయ్యే పనులు కూడా చేస్తుంటున్నారు. ఈ తరహా వీDiయోలు నెట్టింట నిత్యం హల్ చల్ చేస్తుంటాయి.

వీటిలో కొన్ని అసభ్యకరంగా, మరికొన్ని అభ్యంతరకరంగా, భయానంగా ఉంటే.. మరికొన్ని మాత్రం సరదాగా, హాస్యంగా అనిపిస్తుంటాయి. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా ఏపీలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ కి సంబంధించి ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. ఈ వీడియోలో సదరు డ్రైవర్.. జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ "దేవర" లోని హిట్ సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

అలా డ్యూటీలో ఉండి.. బస్సును ఆపి.. దాని ముందు ఇలా రీల్స్ చేస్తూ కనిపించడం భిన్నాభిప్రాయలు వక్తమవుతున్నాయి. ఈ సమయంలో... తుని బస్టాండ్ ప్రయాణికులు.. బస్ ఇంకా రావట్లే అని అనుకుంటుంటే.. ఇంతలో డ్రైవర్... ఇలా చేస్తున్నాడంటూ ఈ వీడియోని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ వ్యవహారం లోకేష్ వరకూ వెళ్లింది.

దీంతో.. ఇతడిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు ఓ నెటిజన్. ఈ సందర్భంగా... ట్రాక్టర్ చెడిపోయి రోడ్డు స్థంబించిపోయినందని స్పందించారు. ఇదే సమయంలో... క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యం కానీ, దారిలో హానిచేయని కోంత వినోదం నేరం కాదు కదా అంటూ స్పందించారు. దీనిపై లోకేష్ ను రిక్వస్ట్ చేశారు.

దీంతో.. ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్.. అతని సస్పెన్షన్ ఉత్తర్వులు ఉపసంహరించబడతాయని.. అతడిని వెంటనే విధుల్లోకి తీసుకుంటారని తెలిపారు. ఇదే సమయంలో... తాను (అమెరికా నుంచి) తిరిగి వచ్చిన తర్వాత అతన్ని వ్యక్తిగతంగా కలుస్తాను అంటూ ఎక్స్ లో ఆసక్తికరంగా స్పందించారు.


Tags:    

Similar News