(ఫామ్) హౌస్ రైడ్... పోలీసుల అభియోగాలు తప్పుబట్టిన ఎన్నారై!
జువ్వాడ (ఫామ్) హౌస్ కేసు వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
జువ్వాడ (ఫామ్) హౌస్ కేసు వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అది రేవ్ పార్టీ అన్నట్లుగా ఒకవైపు ఆరోపణలు వినిపిస్తుంటే, అభియోగాలు నమోదవుతుంటే.. మరో వైపు అది కొత్త ఇంటిలోకి వెళ్లిన సందర్భంగా చేసుకున్న ఫ్యామిలీ పార్టీ విత్ దీపావళి సెలబ్రేషన్స్ అని మరోవైపు నుంచి వినిపిస్తుంది.
ఈ సమయంలో ఆ పార్టీలో పాల్గొన్న రాజ్ స్నేహితుడు విజయ్ మద్దూరి (56) కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలిందని చెబుతున్నారు. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో విజయ్ మద్దూరి స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. పోలీసులు చేస్తున్న ఆరోపణలు అన్యాయమని అన్నారు.
అవును... జువ్వాడ (ఫామ్)హౌస్ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ మద్దూరి వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్ పాకాల దీపావళి పార్టీకి కుటుంబ సమేతంగా ఆహ్వానించారని.. అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని తెలిపారు. తమను టార్గెట్ చేస్తున్నట్లు పోలీసులు చేస్తున్న ఆరోపణలు అన్యాయమని అన్నారు.
ఇక తాము ఎలాంటి తపూ చేయలేదని.. కొద్ది రోజుల క్రితమే ప్రపంచ యాత్ర చేసి వచ్చినట్లు వివరించారు.. దీనికి సంబంధించిన ఆధారాలు అన్నీ పోలీసులకు చూపించినట్లు తెలిపారు. అయినప్పటికీ తాను చెప్పని మాటలను చెప్పినట్లుగా ఎఫ్.ఐ.ఆర్.లో రాసుకున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తమపై వస్తోన్న ఆరోపణలను నమ్మొద్దంటూ ప్రజలను కోరారు.
ఇక తాను అమెరికాలో చదువుకుని.. అక్కడే 15 సంవత్సరాలు ఉండి.. అమెరికా పౌరుడు ఐనట్లు చెప్పిన విజయ్... తనకు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తనది మచ్చలేని కెరీర్ అని.. భారత్ లో తాను ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకూ పాల్పడలేదని అన్నారు.