సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నేతల్లో కేటీఆర్ ఒకరు. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కాకుండా పలు అంశాల్ని ప్రస్తావిస్తూ ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెడుతుంటారు. ఎప్పుడూ కూల్ గా ఉంటూ.. ఆసక్తికర ట్వీట్లు చేసే కేటీఆర్ కు తాజాగా ఒక యూజర్ తీరు ఆయనకు ఆగ్రహం తెప్పించినట్లుగా కనిపిస్తోంది. దీంతో.. ఆయన ట్వీట్ కు తిరిగి రీట్వీట్ చేస్తూ బదులిచ్చారు.
మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ అకాల మరణంతో తీవ్ర దిగ్భాంత్రికి గురైన కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తన వేదనను పంచుకున్నారు. సంతాపాన్ని ప్రకటిస్తూ.. గతంలో ఆమెను కలిసిన సందర్భంగా ఉన్న ఫోటోల్ని పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ఒక పాకిస్థానీ స్పందించాడు. కశ్మీర్ పై భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఆవిడ చనిపోయారని.. నరకం ఆమె కోసం ఎదురుచూస్తుందన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారు.
దీనిపై కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సుష్మా స్వరాజ్ మీద మీరుచేసిన కామెంట్ హ్యాస్యాస్పదం. ఈ కామెంట్ చూస్తే.. మీ వక్ర బుద్ధి బయటపడుతుంది. మీ ప్రొఫైల్ చూస్తే.. పాకిస్థానీలా ఉన్నారు. మీరు ఎవరైనా సరే.. జీవితాంతం ప్రజాసేవలో ఉన్న సుష్మా లాంటి వారిని గౌరవించుకోవటానికి కొంత ధైర్యం సంపాదించుకోగలరని వ్యాఖ్యానించారు. ఈ తరహా ట్వీట్లు కేటీఆర్ కు చాలా అరుదంటున్నారు.