టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల తారకరామారావు బాధ్యతల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణభవన్ లో సోమవారం ఉదయం 11.56 గంటలకు కేటీఆర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ధూంధాంగా నిర్వహించాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా భారీగా ఏర్పాట్లు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్న కేటీఆర్ ను అభినందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నాయకులు - పార్టీ శ్రేణులు హాజరయ్యే అవకాశమున్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లుచేశారు. అయితే, ప్రమాణస్వీకారం చేసే తొలిరోజే తన మార్కు దూకుడు ఏంటో చూపించేందుకు గులాబీ పార్టీ యువనేత డిసైడయ్యారు. పార్టీ ఫిరాయించిన శాసనమండలి సభ్యులపై వేటు వేయాలని కోరాలని టీఆర్ ఎస్ పార్టీ తరఫున నిర్ణయించారు. ఇందులో భాగంగా మండలిలో టీఆర్ ఎస్ నేతలు సోమవారం మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు ఫిర్యాదు చేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నలుగురు శాసనమండలి సభ్యులు పార్టీ నుంచి ఫిరాయించారు. టీఆర్ ఎస్ తరఫున ఎన్నికైన ఎమ్మెల్సీలు కొండా మురళి - ఆర్ భూపతిరెడ్డి - కే యాదవరెడ్డి - రాములునాయక్ కాంగ్రెస్ లో చేరారు. కొండా మురళి - భూపతిరెడ్డి స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యారు. కే యాదవరెడ్డి ఎమ్మెల్యే కోటాలో - రాములు నాయక్ గవర్నర్ కోటాలో నామినేట్ అయ్యారు. వీరు పార్టీ ఫిరాయించారనే దానికి ఆధారాలు చూపుతూ మండలి చైర్మన్ కు టీఆర్ ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. శాసనమండలిలో చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి - విప్ లు పల్లా రాజేశ్వర్ రెడ్డి - బీ వెంకటేశ్వర్లు సోమవారం మండలి చైర్మన్ స్వామిగౌడ్ ను కలిసి ఫిర్యాదు చేస్తారు. టీఆర్ ఎస్ నుంచి ఎన్నికై పార్టీ మారినందున వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని కోరుతారు.
కాగా, ఈ చర్య ద్వారా కేటీఆర్ కీలక సందేశం ఇవ్వనున్నారని అంటున్నారు. పార్టీలో క్రమశిక్షణ ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలియజెప్పడం - పార్టీని దూషించేవారికి గట్టి షాక్ ఇవ్వడం లక్ష్యంగా ఈ సస్పెన్షన్ల ఫిర్యాదు పర్వానికి కేటీఆర్ శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. పార్టీలో శ్రమించే వారికి గుర్తింపు ఉంటుందనే సందేశాన్ని ఇప్పటికే కేటీఆర్ అందించిన సంగతి తెలిసిందే.