బీజేపీలోకి కేటీఆర్..కంఫార్మ్ చేసిన కేంద్ర మంత్రి!

Update: 2020-02-19 11:43 GMT
కేటీఆర్ ..కేసీఆర్ తనయుడిగా రాజకీయ ప్రవేశం చేసి ..రాజకీయాలలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ డైనమిక్ పొలిటిషన్స్ లో ఒకరు. ప్రస్తుతం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటుగా మంత్రిగా కూడా మరో వైపు బాధ్యతలని నిర్వర్తిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తున్నారు. అలాగే తన దృష్టికి వచ్చిన ఈ సమస్యనైనా కూడా క్షణాల వ్యవధిలో , అక్కడిక్కడే ఆ సమస్యకి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తారు అన్న పేరుని కూడా సంపాదించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శలు చేయాలన్న ..ప్రజలని ఆకర్షించేలా మాట్లాడాలన్నా కేటీఆర్ కి సాటిరారు మరెవరూ.

ఇకపోతే , తాజాగా బయోఏషియా 2020లో జరిగిన సీఈఓల కాంక్లేవ్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బయో ఏషియా సదస్సుకు 37 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఈ సమ్మిట్ లో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ .. బయో ఆసియా సదస్సు అంతర్జాతీయంగా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని , భారత్‌ లోని ఫార్మా ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ నుంచే 35 శాతం తయారవుతుందని హైదరాబాద్‌ లో ఫార్మాసిటీ అవసరాన్ని కేంద్రం గుర్తించిందని.. అందుకే అన్ని అనుమతులూ వచ్చాయన్నారు కేటీఆర్ తెలిపారు.

ఇక ఈ సమ్మిట్ లో పాల్గొన్న .. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఔషధాల ధరల నియంత్రణ, తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావడంపై కేటీఆర్‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. దేశంలోని 130 కోట్ల మంది జనాభాకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అలాగే ఔషధ ధరల నియంత్రణ, పరిశ్రమకు ప్రోత్సాహకాలను తొలగించడం, రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడం వంటి సమస్యలను కేటీఆర్‌ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇక ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి గోయెల్ , కేటీఆర్ మధ్య ఒక ఆసక్తికర చర్చ జరిగింది.

మంత్రి కేటీఆర్ అడిగిన ప్రశ్నలకి కేంద్రమంత్రి గోయెల్ సమాధానం ఇస్తూనే .. కేటీఆర్ లో మంచి మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నాయని, ‘హైదరాబాద్‌ను మార్కెటింగ్‌ చేయడంపై కేటీఆర్‌ దృష్టి సారిస్తున్నారని.. అదే విదంగా భారత్‌ను మార్కెటింగ్‌ చేయడంపై దృష్టి పెడితే బాగుంటుంది. అప్పుడు భారత్‌ ను మరింత బాగా మార్కెట్‌ చేయొచ్చని గోయెల్‌ అన్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌ .. నేషనల్‌ పార్టీని పెడతానని సెటైర్ వేశారు. దీనితో వెంటనే గోయెల్‌ మా దగ్గర ఖాళీ ఉంది.. రావచ్చు కదా అని అనడంతో సదస్సు నవ్వులతో పులకరించిపోయింది.




Tags:    

Similar News