కేటీఆర్ హుజూరాబాద్ కు ఎందుకెళ్లడం లేదు?

Update: 2021-08-06 06:41 GMT
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా అక్కడికి వెళ్లి గెలుపు బాధ్యతలు తీసుకోవాల్సిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కీలకమైన హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం అడుగుపెట్టకపోవడం హాట్ టాపిక్ గా మారింది.. అదే జిల్లా మంత్రి అయిన కేటీఆర్ రాష్ట్రంలో సీఎం తర్వాత అన్నీ తానై చూసే వ్యక్తం ఎందుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యతలు తీసుకోకుండా దూరంగా ఉన్నాడన్నది హాట్ టాపిక్ గా మారింది.

మెదక్ జిల్లా మంత్రి అయిన హరీష్ రావుకు కేసీఆర్ ఈ బాధ్యతలు అప్పజెప్పడం విశేషం. ఇప్పటివరకు తెరవెనుక పనిచేసిన హరీష్ రావు ఇప్పుడు హుజూరాబాద్ లో అడుగుపెట్టి అక్కడ పరిస్థితులను టీఆర్ఎస్ కు అనుకూలంగా మారుస్తున్నారు. మాములుగా అయితే అలాంటి ఎన్నికల బాధ్యతలన్నీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూసుకోవాలి. కేటీఆర్ కే అన్ని ఎన్నికల బాధ్యతలను ఇస్తూ వచ్చిన సీఎం కేసీఆర్ ఈసారి మాత్రం కొడుకు కన్నా అల్లుడు హరీష్ రావుకే ప్రాధాన్యం ఇవ్వడం విశేషం అని చెప్పొచ్చు.

హరీష్ రావు ఇప్పుడు హుజూరాబాద్ లో చక్రం తిప్పుతున్నారు. మొత్తం అన్ని పార్టీల నేతలను టీఆర్ఎస్ లోకి చేర్పిస్తున్నారు. ఈటల రాజేందర్ పై విమర్శలు గుప్పిస్తూ ఆయనను నైతికంగా ఒంటరిని చేసే బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తున్నారు. ఈటల వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. ప్రజలు వ్యక్తి కంటే వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ మోడీ ఫొటోను ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించాడు. ప్రధాని మోడీ ఫొటో చూడగానే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు గుర్తుకు వచ్చి ఓట్లు పడవని అనుకుంటున్నారా..? అని అన్నారు. ఈటల రాజేందర్ ప్రచార శైలిని మార్చారన్నారు. కాషాయ రంగులో కేవలం తన ఫొటోనే మాత్రమే వేసుకుంటూ మిగతా నాయకుల ఫొటోలను పక్కనపెడుతున్నారన్నారని విమర్శించారు. బీజేపీలో చేరిన ఈటల గెలిస్తే నియోజకవర్గానికి చేసేదేమీ లేదన్నారు. తన ప్రతాపంతో కేంద్రం నుంచి రూ.1000 కోట్లు తెచ్చే సత్తా ఉందా..? అని అన్నారు. ఈటల మాటలకు ప్రజలు మోసపోవద్దన్నారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ 1000 చేశారని, భవిష్యత్లో రూ.1500 చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటో అఅందరికీ అర్థమైందని అన్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఈటల రాజేందర్ గెలిస్తే ఏమీ కొత్తగా జరగదని హరీష్ రావు చేస్తున్న ప్రచారం కూడా కలిసివస్తోంది. ఇన్ని రోజులు కామ్ గా ఉన్న హరీశ్ రావ్ ఇక రంగంలోకి దిగడంతో నియోజకవర్గంలో ప్రచారం వాడీవేడిగా మొదలైందని అనుకుంటున్నారు. ఇక నోటిఫికేషన్ రాకముందే మాటల యుద్ధంతో ఇక్కడ రాజకీయం వేడెక్కుతోంది. నోటిఫికెషన్ వెలువడిన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ను ఉప ఎన్నికల బాధ్యతల నుంచి దూరంగా పెట్టడం ఇప్పుడు టీఆర్ఎస్ లో చర్చనీయాంశమైంది. హుజూరాబాద్ లో గెలుపు అంత సులువు కాదు కాబట్టి ముందు జాగ్రత్తగా ట్రబుల్ షూటర్ అయిన హరీష్ రావును రంగంలోకి దించారని అంటున్నారు.

అయితే హుజూరాబాద్ లో గెలిచే చాన్స్ లేదని..అందుకే హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారని.. ఓడిపోయినా నెపాన్ని హరీష్ రావు మీద నెట్టి కేటీఆర్ ను సేఫ్ చేసేలా రాజకీయాన్ని కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు.

ఇక ఈటల సైతం నియోజకవర్గంలో ఉద్యమకారులకు అన్యాయం అని తెరపైకి తెస్తున్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలో ఈటలతోపాటు సమంగా పోరాడిన హరీష్ రావును ముందు పెట్టడం వల్ల కేసీఆర్ దెబ్బతీసే ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇక ఈటల గుట్లు మట్లు అన్నీ హరీష్ కు తెలుసు. వీరిద్దరూ గతంలో చాలా సన్నిహితులు. అందుకే కేసీఆర్ గుర్తించి పక్కాగా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారని.. ఈటలనె దెబ్బతీసే బాధ్యతలను హరీష్ సమర్థవంతంగా నిర్వహిస్తాడని ఈ స్కెచ్ గీశాడని అంటున్నారు.




Tags:    

Similar News