తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శైలిని ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ సైతం అనుసరిస్తున్నట్లు తెలుస్తున్నది. కీలకమైన నిర్ణయం ఏదైనా ప్రకటించేముందు - ఆ తర్వాత గవర్నర్ తో సీఎం కేసీఆర్ సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇపుడు అదే తరహాలో మంత్రి కేటీఆర్ వ్యవహించారని అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు తప్పనిసరిగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ టీఎస్ వాలెట్ పేరుతో కొత్త యాప్ ను తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇక లావాదేవీలన్నీ నూతన విధానంలోనే చేయనున్నట్లు తెలిపారు. ఇంతటి కీలకమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ విషయాన్ని రాజ్యాంగపరంగా ప్రభుత్వ అధినేత అయిన గవర్నర్ కు తెలంగాణ సర్కారు తెలియజెప్పింది.
అయితే ఈ ఎపిసోడ్ లో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... పరిపాలన రథసారథి అయిన సీఎం కేసీఆర్ సహజంగా గవర్నర్ తో భేటీ అవాల్సి ఉంటుంది. ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోతే ఉప ముఖ్యమంత్రులు కలవడం ఆనవాయితీ. కాని సీఎం కేసీఆర్ బదులుగా కేటీఆర్ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశం ద్వారా ఎలాంటి సందేశాన్ని పంపించదలుచుకున్నారని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇదిలాఉండగా ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలని కేటీఆర్ అధికారులకు నిర్దేశించారు. ప్రభుత్వానికి ఆదాయం పెరగాలన్నదే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గనుల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ టీఎస్ ఎండీసీ ద్వారా కొత్త ఇసుక రీచ్ లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలని అధికారులకు సూచించారు. స్థానిక అవసరాల పేరుతో ఉన్న అక్రమ నిల్వలను సీజ్ చేయాలని, అక్రమంగా ఇసుక తరలించే వాహనాలు సీజ్ చేసి, వ్యక్తులను అరెస్ట్ చేయాలని కేటీఆర్ ఆదేశించారు. ఇసుక తవ్వకాల కోసం గనుల శాఖ అధికారులు జిల్లాల్లో పర్యటించాలని, పోలీసులు - రెవెన్యూ అధికారులు సంయుక్తంగా బృందాలతో తనిఖీలు జరపాలని అధికారులకు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/