తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పాలేరు ఉప ఎన్నికల ప్రచారం హైపిచ్ కు చేరుకుంది. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు కేవలం రెండు రోజులే ఉండటంతో ఎన్నికల బరిలో నిలిచిన రాజకీయ పార్టీలు తమ గళాన్ని మరింత బలంగా వినిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ తమకు ప్రత్యర్థులుగా విపక్షాలన్నీ ఏకం కావటంపై విరుచుకుపడిన టీఆర్ ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు కాస్త టోన్ మార్చారు. ఇప్పుడు వారి ఫోకస్ అంతా ‘‘సానుభూతి’’ మీద ఉండటం గమనార్హం.
తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ మాటల్నే తీసుకుంటే.. ఈ ఎన్నిక అభ్యర్థుల మధ్య పోరు ఎంతమాత్రం కాదని.. పార్టీల మధ్య పోరుగా అభివర్ణించటం చూస్తే విషయం ఇట్టే అర్థమవుతుంది. నిజానికి ఎన్నికలు ఎప్పుడూ పార్టీ.. అభ్యర్థులు రెండింటి మధ్యన ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏ పార్టీ నేతలు ప్రచారం చేయని కొత్త కొత్త అంశాల్ని ప్రస్తావిస్తూ మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మీద ఉన్న సానుభూతి ఎక్కడ వర్క్ వుట్ అవుతుందన్న సందేహం తెలంగాణ అధికారపక్షం మీద ఉన్నట్లుగా కనిపిస్తోందని చెప్పక తప్పదు.
తమను ఒంటరిగా ఎదుర్కోలేని విపక్షాలు ఏకమయ్యాయని.. సానుభూతి పేరిట కాంగ్రెస్ కొత్త నాటకానికి తెర తీసిందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించటం గమనార్హం. పోలింగ్ కు రోజులు దగ్గర పడుతున్న వేళ.. సానుభూతి అంశాన్ని కేటీఆర్ పదే పదే ప్రస్తావిస్తూ దాని మీద వ్యాఖ్యలు చేస్తున్న వైనం చూస్తే పాలేరు ఉప ఎన్నిక ఎంతా పోటీపోటీగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.