ఏపీలో వైజాగ్ స్టీల్ పరిరక్షణ ఉద్యమం తారస్థాయికి చేరింది. వీలైతే ప్రైవేటీకరిస్తాం.. లేదంటే మూసేస్తాం అంటూ పార్లమెంట్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించడంతో ఆందోళన తీవ్ర రూపం దాలుస్తోంది. ఏం చేసినా ప్రైవేటీకరణ ఆగదంటూ ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనతో మంగళవారం నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. ఉద్యోగులు, కార్మికులు రహదారులను స్తంభింపజేశారు. స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ వేణుగోపాలరావును దాదాపు ఐదారు గంటలపాటు నిర్బంధించారు.
ఇటు రాష్ట్రమంతటా ‘ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు’ నినాదాలు మిన్నంటుతున్నాయి. స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణకు ప్రాణాలైనా అర్పిస్తాం అంటూ కార్మికులు ఉద్యమిస్తున్నారు. కేంద్రం బెదిరింపులతో కూడిన వ్యూహాలను అమలు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ప్రకటించడం విశేషం. అంతేకాదు.. అవసరమైతే విశాఖ వెళ్లి ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొని, మద్దతు తెలుపుతామన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
‘‘తెలంగాణ రాష్ట్రం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు. కానీ.. ఇప్పుడు విశాఖలో పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయం వల్ల కార్మికులు, ఉద్యోగులు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారు. వారికి మేం అండగా ఉంటాం. అవసరమైతే కేసీఆర్ అనుమతితో వైజాగ్ వెళ్లి ప్రత్యక్షంగా వారి పోరాటానికి మద్దతు తెలియజేస్తాం. ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమంతో మనకెందుకులే అనుకుంటే.. రేపు మన దగ్గరకు కూడా వస్తారు. ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నారు. రేపు బీహెచ్ఈఎల్ అమ్ముతారు. ఎల్లుండి సింగరేణి అమ్ముతారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు..? వీటిని కూడా ప్రైవేటు పరం చేయండి అంటారు.’’ అని వ్యాఖ్యానించారు కేటీఆర్.