ఆ సీఎంను పొగిడేసిన కేటీఆర్

Update: 2017-03-08 08:36 GMT
అప్పుడప్పుడు ఆసక్తికరమైన ట్వీట్లు చేస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్. రాజకీయాలకు అతీతంగా ఆయన కొందరితో ఉండే రిలేషన్స్ ఆసక్తికరంగా కనిపిస్తుంటాయి. ఉద్యమ సమయానికి భిన్నంగా.. పవర్ లోకి వచ్చిన తర్వాత కేటీఆర్ సంబంధాలు విస్తృతం కావటమే కాదు.. ఆయన అంతకంతకూ విస్తరిస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

ఇక.. వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలతో చక్కటి సంబంధాల్ని నెరపటంలోనూ కేటీఆర్ స్పీడుగా ఉంటారని చెబుతుంటారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తో కేటీఆర్ కు చక్కటి ఫ్రెండ్ షిప్ ఉందని చెబుతుంటారు. తెలంగాణ ప్రభుత్వ విధానాల్ని సమర్థించేలా అఖిలేశ్ వ్యాఖ్యానించటం.. అందుకు ప్రతిగా అన్నట్లు మంత్రి కేటీఆర్.. యూపీకి వెళ్లి సీఎం అఖిలేశ్ ను కలిసి రావటం తెలిసిందే.

ఇక్కడ అఖిలేశ్ కు.. కేటీఆర్ కు మధ్యన కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఇరువురు యువ నేతలు కావటం.. ఇద్దరి తండ్రులు పార్టీ అధ్యక్షులు కావటం.. వారసత్వ రాజకీయాల్లో నుంచి వచ్చిన వైనంతో పాటు.. ఇద్దరు ముఖ్యమంత్రులు సాంకేతికతను వినియోగించుకునే వైనం ఒకేలా కనిపిస్తుంటుంది. తాజాగా జరుగుతున్న యూపీ ఎన్నికల వేళ ఏ మాత్రం రియాక్ట్ కాని కేటీఆర్.. ఎన్నికల దశ చివరికి వచ్చిన వేళ.. సీఎం అఖిలేశ్ ను పొగిడేస్తూ.. కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు.

‘‘రాజకీయాల్ని పక్కన పెడితే.. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. నేను కలిసిన సీఎంలలో అఖిలేశ్ చాలా నిరాడంబరమైన వ్యక్తి. నాకు నచ్చిన వ్యక్తిగా చెప్పక తప్పదు’’ అని తాను కలిసిన ఫోటోల్ని పోస్ట్ చేసి మరీ ట్వీట్ చేయటం కనిపిస్తుంది. మరింతలా పొగిడేసిన కేటీఆర్.. ఎన్నికల వేళ.. ఒక్కటంటే ఒక్క ట్వీట్ చేయకుండా.. ఎన్నికలు ముగిసిన తర్వాత ట్వీట్ చేయటంలో మర్మం ఏమిటి మంత్రివర్యా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News