లోకేష్‌ కు దిమ్మ‌తిరిగే పంచ్ ఇచ్చిన కేటీఆర్‌

Update: 2017-04-18 04:42 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - మంత్రి కేటీఆర్ పంచ్‌ ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అవ‌కాశం దొరికితే చాలు త‌న ప్ర‌త్య‌ర్థిపై మాట‌ల తూటాలు పేలుస్తుంటారు. తాజాగా ఆయ‌న పంచ్ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడైన యువ మంత్రి నారా లోకేష్‌ పై ప‌డింది. చాలా రోజుల త‌ర్వాత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కేటీఆర్ ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా లోకేష్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం - అందులోనూ ఐటీ - మునిసిపల్‌ శాఖల‌ను తీసుకోవ‌డంపై పాత్రికేయులు ప్ర‌స్తావించ‌గా... లోకేష్‌ గతంలో తనను నాన్‌ లోకల్ మిమ‌ర్శించి హైద‌రాబాద్ లో పుట్టిన తాను మాత్రమే లోకల్‌ అని చెప్పాడని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు ప‌క్క రాష్ట్రంలో మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌డం ద్వారా ఎవరు ఎక్కడున్నారో, ఎవ‌రు తెలంగాణ కోసం ఉన్నారో అర్థం అయింద‌ని కేటీఆర్ అన్నారు. లోకేష్‌ ఏపీ కేబినెట్‌ లో చేరగానే తెలంగాణ‌లో టీడీపీ మూత పడిందని అర్ధమని ఎద్దేవా చేశారు.

అనంత‌రం జగిత్యాలలో జరిగిన జనహిత ప్రగతి సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ ఎస్ జైత్రయాత్ర జగిత్యాల నుంచే మొదల‌వుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జగిత్యాల దెబ్బ ఎలా ఉంటదో గోదావరి పుష్కరాల టైమ్‌ లో చంద్రబాబుకు తెలిసిందన్నారు. జగిత్యాల దెబ్బతోని చంద్రబాబు మన రాష్ట్రం వదిలిపెట్టి పోయాడ‌ని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి పోషించిన పాత్రేంటని ప్రశ్నించారు.  జీవన్‌ రెడ్డి ఆంధ్రా నాయకుల తొత్తని మండిపడ్డారు. ఉప ఎన్నిక‌ల్లో పొరపాటున ఆనాడు కేసీఆర్ ఓడిపోయి ఉంటే నేడు తెలంగాణను చూసేవాళ్లమా అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు అండగా నిలబడ్డారని కేటీఆర్ పునరుద్ఘాటించారు. పేదవాళ్లకు సబ్సిడీ ఇవ్వడమంటే తిరోగమన చర్య అని చంద్రబాబు అన్నార‌ని గుర్తు చేశారు. కాంగ్రెస్-టీడీపీ హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తదో..ఎప్పుడు పోతదో తెలియని ప‌రిస్థితి ఉండేద‌ని, రైతుల కోసం పట్టపగలు 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఘ‌న‌త తెలంగాణ స‌ర్కారుద‌ని కేటీఆర్ వెల్లడించారు. ``ఒకప్పుడు ఎరువులు - విత్తనాల కోసం రైతులు గోడుగోడున ఏడ్చారు. ఇప్పుడు సకాలంలో రైతులకు ఎరువులు - విత్తనాలు అందిస్తున్నాం. ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పిన సీఎం..రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారు` అని తెలిపారు. పొరపాటున కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News