పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు - విమర్శలు ప్రతి విమర్శలు ముదురుతున్నాయి. అధికార - ప్రతిపక్ష నేతలు తమదైన వైలిలో ఓ వైపు ప్రచారం చేసుకుంటూ మరోవైపు విపక్ష పార్టీలపై విమర్శలు సైతం చేస్తున్నారు. ఇక ఎన్నికల మ్యానిఫెస్టోల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, తాజాగా టీఆర్ ఎస్ నేత - తెలంగాణ మంత్రి కేటీఆర్ చేతిలో కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి అడ్డంగా బుక్కయింది. పేదలకే ఎంతో భరోసాను కల్పిస్తున్నట్లు ప్రకటించనున్న తమ నూతన పథకం వెనుక అసలు లొసుగును ఆయన బట్టబయలు చేశారు. మహాకూటమి పేరుతో చెప్పింది ఒకటి చేసింది మరొకటని ఎద్దేవా చేశారు.
తెలంగాణ సీఎం - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల హామీని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇది ఆచరణలో అంత సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తాము డబుల్ బెడ్రూం రూం ఇండ్లకు సమానంగా రూ.5 లక్షల మొత్తం ఇస్తామని ప్రకటించారు. అయితే, తాజాగా తమ ఎన్నికల ప్రచారంలో ఈ మొత్తాన్ని రుణంగా పేర్కొన్నారు. దీంతో ఈ పోకడను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. ``మహాకూటమి నాయకులు తమ మ్యానిఫెస్టోలో ఏం చెప్పారు. ఇళ్లు కట్టుకోవడానికి పేదలకు 5 లక్షలు ఇస్తాము అని మొదట చెప్పారు. ప్రజలను అలా ఇళ్ల పేరుతో మభ్య పెట్టారు. వాళ్లు ఇచ్చిన ప్రకటనల్లో మాత్రం.. రూ. 5 లక్షల రుణం ఇస్తాం అంటూ ఇప్పుడు మాట మారుస్తున్నారు. వామ్మో.. ఎంత మోసం ఎంత దగ. అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడేటట్టున్నారు మహా కూటమి నాయకులు. ఈ దగా కూటమిని నమ్మితే మోసపోతం - గోసపడతం.. వీళ్లు చేసే వాగ్దానాలు ఎంత మోసపూరితమో.. ఈ ఘటనే బెస్ట్ ఉదాహరణ.. అంటూ`` మంత్రి కేటీఆర్ ఆధారాలతో సహా మహా కూటమి మోసపూరిత హామీని ట్విట్టర్ వేదికగా బయటపెట్టారు.