' హైదరాబాద్‌ - విజయవాడ మధ్య హైస్పీడ్ రైలు '

Update: 2020-06-29 17:00 GMT
హైదరాబాద్‌ - విజయవాడ మధ్య హైస్పీడ్‌ రైలు ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. హై స్పీడ్ రైలు వస్తే హైవే వెంబడి అభివృద్ధి జరుగుతుంది అని ఆకాంక్షించారు. ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో హరితహారంలో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంపీ ఉత్తమ్ , మంత్రి జగదీశ్ తో కలిసి హుజూజ్ నగర్ లో RDO నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ...హైదరాబాద్ గొప్ప మెట్రోపాలిటన్ నగరమని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని, పాలనను ప్రజల ముంగిటకు తెస్తూ సీఎం కేసీఆర్‌ పరిపాలనలో సంస్కరణలకు తెరలేపారని కేటీఆర్‌ వివరించారు. హుజూర్‌ నగర్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని కేటీఆర్ తెలిపారు. హుజూర్‌ నగర్‌ లో సిల్క్ డెవలప్ ‌మెంట్‌ సెంటర్ ‌ని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు.

వైరస్ తో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇలాంటి కష్టకాలంలోనూ రైతులకు రైతు బంధు కింద కేసీఆర్ సాయం చేశారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 54 లక్షల 22 వేల రైతులకు 7 వేల కోట్లను రైతు బంధు కింద విడుదల చేసినట్లు వివరించారు. పార్టీలకు అతీతంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని.. తమ ముందున్న లక్ష్యం అభివృద్ధి మాత్రమేనని కేటీఆర్ తెలిపారు.
Tags:    

Similar News