పవ‌న్ పొంగిపోయిన అంశాన్ని కేటీఆర్ లైట్ తీసుకున్నాడు

Update: 2018-02-12 13:29 GMT
గ‌త ఏడాది జ‌న‌సేన‌ అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న క‌ళ్యాణ్ విష‌యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త మీడియాలో జోరుగా హ‌ల్‌ చ‌ల్ చేసిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్ళిన పవన్ ఈ రోజు హార్వర్డ్ యూనివర్సిటీలో కీ నోట్ ప్రసంగం చేశారు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి 9వ తేది ఉదయం 5గంటల నుండి పలు కార్యక్రమాలతో బిజీ అయిన పవన్ 12వ తేది సాయంత్రం వరకు అనేక సమావేశాలలో పాల్గొన్నారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సినిమాలకు - రాజకీయాలకు సంబంధించి అనేక అంశాలపై మాట్లాడిన పవన్ హర్వర్డ్ యూనివర్సిటిలో ఇన్‌ స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు. ``హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రసంగం అంటే చిన్న విషయం కాదు. అందుకే నాకు ఆహ్వానం అందినప్పడు కాస్త ఆలోచించాను. కొంత సమయం తీసుకున్నాకే ఇక్కడికి రావడానికి అంగీకరించాను``అని తెలిపారు. తన స్కూలింగ్ టైంలో జరిగిన కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ తనలో ఉన్న సామాజిక స్పృహ ని మరోసారి గుర్తు చేశారు. ఇక కొన్ని సందర్భాలలో కొన్ని పెయిన్ ఫుల్ సిచ్చుయేషన్స్ ని తట్టుకోలేక తన అన్నయ్య చిరంజీవి రివాల్వర్ తో కాల్చుకొని సూసైడ్ చేసుకోవాలనుకున్నట్టు చెప్పాడు. కుటుంబంలోని కొందరు కౌన్సిల్ ఇవ్వడం వలన ఆ నిర్ణయం మార్చుకున్నట్టు పేర్కొన్నాడు. ఇక ప్రత్యేక హోదా అంశం గురించి కూడా కొంత ప్రస్తావించాడు. తన స్కూలింగ్ టైంలో భాషా వలన వచ్చిన కొన్ని సమస్యలను వివరించాడు.

ఈ స‌మావేశాన్ని స‌హ‌జంగానే ప‌వ‌న్ ఫ్యాన్స్‌ - జ‌నసేన పార్టీ నేత‌లు వైర‌ల్ చేశారు. త‌మ నాయ‌కుడికి ద‌క్కిన గౌర‌వ‌మ‌ని కొనియాడారు. అయితే అదే ఆహ్వానాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లైట్ తీసుకున్నారు. ఒక‌టి కాదు రెండు సార్లు. అది కూడా వ‌రుసగా రెండు సార్లు ఈ స‌మావేశానికి కేటీఆర్ వెళ్ల‌లేదు. తాజాగా ఈ ఏడాది జ‌రిగిన స‌ద‌స్సుకు కేటీఆర్‌ కు ఆహ్వానం అందింది. అయితే మంత్రి కేటీఆర్ హాజ‌రుకాలేక‌పోయారు. అయిన‌ప్ప‌టికీ…ఆయ‌న త‌న స్పంద‌న చాలా హుందాగా ఓ ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు. `హార్వ‌ర్డ్‌ లో కీల‌క ప్ర‌సంగానికి రాలేక‌పోతున్నందుకు క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నారు. వ‌రుస‌గా రెండో సారి హాజ‌రుకాలేక‌పోయాను. వ‌చ్చే ఏడాది త‌ప్ప‌కుండా వ‌స్తాను` అంటూ ట్వీట్ చేశారు.

హార్వ‌ర్డ్‌ లో జ‌రిగే ఇండియా కాన్ఫ‌రెన్స్ స‌ద‌స్సుకు హాజ‌రుకావాలని ఆహ్వానం అందిందే త‌డ‌వుగా ప‌వ‌న్ వెళ్ల‌గా...మంత్రి కేటీఆర్ మాత్రం లైట్ తీసుకోవ‌డం...పైగా వ‌రుస‌గా రెండేళ్లు కావడం ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News