అందుకే అంటారు మనది కాని టైంలో ఏదో ఒకటి మాట్లాడే కన్నా.. మౌనంగా ఉండటం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా మాట్లాడాల్సిన పరిస్థితే ఉంటే.. ముక్తసరిగా మూడు ముక్కల్లో విషయాన్ని చెప్పేసి గమ్మున ఉంటే సరిపోతుంది. అందుకు భిన్నంగా ఏదో చెప్పే ప్రయత్నం చేసి.. మరేదో అర్థమైతే వచ్చే తలనొప్పుల్ని తాజాగా టీఆర్ఎస్ యువరాజు కమ్ మంత్రి కేటీఆర్ కు ఎదురవుతోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత ట్వీట్ చేశారు.
విజయం తర్వాత స్పందించటం మామూలే అయినా.. ఓడిన వేళ గొంతు విప్పితే.. అందరి చూపు మీదనే ఉంటాయి. ఇలాంటి వేళ.. రోజువారీగా మాట్లాడే దాని కంటే అప్రమత్తత చాలా అవసరం. ఈ విషయాన్ని కేటీఆర్ మిస్ అయినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే.. హుజూరాబాద్ ఓటమిని ఆయన సరిగా అర్థం చేసుకోకపోవటమే కాదు.. ఎదురైన ఓటమిని హుందాగా ఒప్పుకునే కన్నా.. ఆయన మాటల్లో అహంకారమే ఎక్కువగా కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది.
కారణం.. ఎన్నికల సందర్భంగా కిందా మీదా పడి.. తమ వ్యక్తిగత పోటీగా ఫీలై ప్రచారం చేసిన వారందరికి అయితే గియితే పార్టీ బాస్ కేసీఆర్ సాంత్వన చెప్పటం బాగుంటుంది. అందుకు భిన్నంగా తగదునమ్మా అన్న రీతిలో తనకు తానే పెద్దరికాన్ని ఆపాదించుకొని మంత్రులు హరీశ్.. గంగుల కమలాకర్.. కొప్పుల ఈశ్వర్ తో పాటు ఎంపీ పలువురు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు చెప్పిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల ప్రచారంలో కష్టపడిన విషయాన్ని ప్రస్తావించి.. ఊరడించాల్సిన కేసీఆర్ మౌనంగా ఉంటే.. కేటీఆర్ మాత్రం అందుకు భిన్నంగా సోషల్ మీడియాలో మెసేజ్ చేసిన వైనంతో.. పార్టీకి తానే దిశానిర్దేశం చేసే అంశాన్ని చెప్పే ప్రయత్నం కేటీఆర్ చేశారన్న మాట వినిపిస్తోంది. ఒక ఎన్నిక ఫలితం పార్టీని ప్రభావితం చేయలేదన్న కేటీఆర్.. 20 ఏళ్లలో టీఆర్ఎస్ అనేక ఎత్తుపల్లాల్ని చూసినట్లుగా ట్వీట్ లో పేర్కొన్న కేటీఆర్.. గతంలో ఎదురైన ఎదురుదెబ్బలకు తాజా ఎదురుదెబ్బకు తేడా ఉందన్న విషయాన్ని మర్చిపోవటాన్ని ప్రస్తావిస్తున్నారు.
టార్గెట్ చేసి.. అంతకు మించి టార్చర్ చేసిన రీతిలో ఈటలను ఆడేసుకున్న వైనానికి హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పే తాజా ఫలితం అన్న విషయాన్ని కేటీఆర్ మర్చిపోయారంటున్నారు. గతంలో కేసీఆర్ తో గొడవ పడిన వారెవరూ మళ్లీ కనిపించని పరిస్థితి. ఆ సంప్రదాయానికి భిన్నంగా తాజాగా ఈటలతో కేసీఆర్ కు సరికొత్త అనుభవం ఎదురైందన్న మాట వినిపిస్తోంది. ‘కష్టపడ్డాం.. ప్రజలతీర్పు మరోలా ఉంది. ధన్యవాదాలు’ మాదిరి సింఫుల్ గా విషయాన్ని ట్వీట్ రూపంలో కేటీఆర్ చెప్పి ఉంటే ఇప్పుడు ఎదురవుతున్న విమర్శలు ఉండేవి కావంటున్నారు. ఏమైనా.. ఇబ్బందికర ఓటమి ఎదురైన వేళలోనూ పంచ్ లు తప్పకపోవటం చూస్తే..టైంలో కాస్త తేడా కొడుతున్నట్లుగా ఉందన్న విషయాన్ని కేటీఆర్ ఎప్పటికి గుర్తిస్తారో?