మ‌ళ్లీ ప‌రువు తీయ‌వ‌ద్దంటున్న కేటీఆర్‌

Update: 2017-06-30 04:45 GMT
వర్షకాలం నేప‌థ్యంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ లో రోడ్ల విష‌యంలో ఎదురయ్యే ప‌రిణామాల‌పై పుర‌పాల‌క శాఖ‌మంత్రి కేటీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. వ‌ర్షాకాలం ముగిసే వరకు రోడ్ల నిర్వహాణపైన ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులను అదేశించారు. నగరంలోని రోడ్లను ప్రత్యేకంగా గ్రిడ్ల వారీగా విభజించి వాటిని ఒక్కో ఇంజనీర్ కు భాద్యత అప్పగించాలని మంత్రి స్ప‌ష్టం చేశారు. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అధికారి రోడ్లపైన కనీసం రోజుకు మూడు నాలుగు గంటలపాటు  క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ఆయా ప‌రిధిలోని రోడ్ల‌కు వారే బాధ్యుల‌ని స్ప‌ష్టం చేశారు. సంబంధిత రోడ్ల విష‌యంలో తేడా వ‌స్తే ఇంజనీర్ల‌నే  బాధ్యుల‌ను చేయాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

వర్షాల నేపథ్యంలో జీహెచ్ ఎంసీ రోడ్లు అధ్వానంగా త‌యార‌వ‌డం - విప‌క్షాలు విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వర్షకాలం ముగిసే వరకు రోడ్ల నిర్వహాణపైన ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులను అదేశించారు. ఇందుకోసం గ్రేట‌ర్‌ ఇంజనీర్లు - ఇతర సంబంధిత అధికారులు రోడ్ల నిర్మాణ పనులు - మరమత్తులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలన్నారు. ఈ మరమత్తులకు అవసరం అయిన యంత్రాలను - సామాగ్రిని వెంటనే కొనుగోలు చేయాలని  ఆదేశించారు. నగర రోడ్ల నిర్వహాణ ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రకారం జరగాల్సిన అవసరం ఉందని, ఈ ప్రణాళికను రూపొందించి, అమలు చేసేందుకు గ్రేట‌ర్ ఇంజనీరింగ్‌ సిబ్బందితో ఒక రోజు వర్క్ షాపు నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.  ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అధికారి రోడ్లపైన కనీసం రోజుకు మూడు నాలుగు గంటలపాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఈ ఎడాది రోడ్ల నిర్వహాణపైన గ్రేట‌ర్ కొంత చురుగ్గా పనిచేస్తున్నదన్న మంత్రి, గత ఏడాది ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి మరింత జాగ్రత్త తో పనిచేయాలన్నారు.  నగరంలోని హెచ్ ఎండీఏ పరిధిలోని రోడ్లపైనా కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కేటీఆర్‌ అదేశించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News