తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో టికెట్ల పంపకాలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ ఎస్ ఇప్పటికే 105మంది అభ్యర్థులను ప్రకటించడంతో అసంతృప్తులు బయటపడుతున్నాయి. తమకు టికెట్ దక్కలేదని కొందరు....బాహాటంగా తమ అనుచరుల ద్వారా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో వారిని బుజ్జగించేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారట. కేసీఆర్ ...జాబితాను ప్రకటించినప్పటికీ....బుజ్జగింపులు మాత్రం కేటీఆర్ కు అప్పగించారట. అందుకే డైరెక్ట్ గా కేటీఆర్ రంగంలో కి దిగారట. కేసీఆర్ మాటను కాదని పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై కేటీఆర్ గుర్రుగా ఉన్నారట. డిసిప్లెన్ లేకుంటే టికెట్లు దక్కే అవకాశం లేదని తేల్చేశారట. రెండో దశలో 14 మంది జాబితాలో ఆశావహులందరూ కేటీఆర్ రాకతో ....టికెట్ల కోసం ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నారట.
అయితే, ఆశావహుల బలప్రదర్శనలతో బేజారైన కేటీఆర్....వారికి వార్నింగ్ ఇచ్చారట. పార్టీకి క్రమశిక్షణే ముఖ్యమని....సమర్థులైన అభ్యర్థులకే అవకాశం లభిస్తుందని. తెగేసి చెప్పారట. ఏ నియోజకవర్గమైనా డిసిప్లెన్ ఉన్నవారికే టికెట్లు కేటయిస్తామన్నారట. పార్టీని వీడాలని ఫిక్స్ అయ్యి....బహిరంగ విమర్శలు గుప్పించే వారు పార్టీకి అవసరం లేదని - అటువంటి ప్రయత్నాలు చేసే వారికి టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని కేటీఆర్ కరాకండిగా చెప్పేశారట. అయితే, కేసీఆర్ పాత్రను కేటీఆర్ పోషించడం....ఇపుడు చర్చనీయాంశమైంది. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఖాయమైన నేపథ్యంలో.....కేటీఆర్ పగ్గాలు చేపట్టడంలో ఇది తొలి అడుగని టీఆర్ ఎస్ లో కొందరు నేతలు భావిస్తున్నారు.