ప్రస్తుతం ప్రపంచదేశాలను కరోనా వైరస్ మహమ్మారి భయంతో వణికిపోయేలా చేస్తుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా వైరస్ - ఆ తరువాత చాలా తక్కువ సమయంలోనే ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ఇప్పటికే ఈ మహమ్మారి భారిన పడిన బాధితులు సంఖ్య 20 లక్షలు దాటిందంటే .. పరిస్థితి ఎంత తీవ్రంగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ మహమ్మారి పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇందుకు పెళ్లిళ్లు కూడా మినహాయింపు కాదు. ఇప్పటికే కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి.
అయితే, దేశమంతా కరోనా వేగంగా విస్తరిస్తున్నా..కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ అమలులో ఉన్నా మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు - కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పెళ్లి మాత్రం అనుకున్న సమయానికే ..అనుకున్న విదంగా జరిపించారు. కాంగ్రెస్ నేత ఎం.కృష్ణప్ప మనవరాలు రేవతితో నిఖిల్ పెళ్లి బెంగళూరు శివారులోని రామనగర సమీపంలో ఉన్న కేతగానహళ్లి ఫామ్ హౌస్ లో చాలా నిరాడంబరంగా జరిగింది. అయితే , పెళ్లి జరిగిన కాసేపటికే ఈ పెళ్లి లో సోషల్ డిస్టెన్స్ పాటించలేదంటూ పలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
దీనితో కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో వివాహం జరపడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే వ్యవస్థను వెక్కిరించినట్లౌతుందన్నారు. తాము ఇప్పటికే రామ్ నగర్ డిప్యూటీ కమిషనర్ నుంచి నివేదిక కోరామని అయన చెప్పారు. జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడామన్నారు. చర్యలు తప్పవని అశ్వథ్ నారాయణ్ హెచ్చరించారు. అలాగే లాక్ డౌన్ సమయంలో కుమారుడి పెళ్లి జరిపించడంతో కుమారస్వామి పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు.