చంద్రబాబునాయుడుకు కుప్పం నేతలు షాకిచ్చారు. కుప్పం మున్సిపాలిటీ లో ఓటమిపై పార్టీ ఆఫీసులో చంద్రబాబు సమీక్షించారు. ఈ సమీక్షలో పాల్గొన్న నేతలు ఓటమికి అసలు కారణాలను బయటపెట్టారని సమాచారం. నేతలు చెప్పినదాని ప్రకారం అభ్యర్థులను చాలా ఆలస్యంగా ఫైనల్ చేయటం, ఇంటింటి ప్రచారానికి కూడా పెద్ద నేతలు ఎవరు అందుబాటులో లేకపోవటం, చంద్రబాబు నాన్ లోకల్ అనే ప్రచారాన్ని జనాలు నమ్మటం, ప్రత్యర్థులతో టీడీపీ నేతల్లో కొందరికి వ్యాపార సంబంధాలుండటం లాంటి అంశాలను స్ధానిక నేతలు బాహాటంగానే ప్రస్తావించారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే 30 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్నా కుప్పంలో చంద్రబాబుకు సొంతిల్లు లేకపోవటమే.
పనిలోపనిగా కుప్పంలో దశాబ్దాలుగా ఐదారుగురు నేతలు మాత్రం పెత్తనం చెలాయిస్తుండటాన్ని దిగువస్ధాయి నేతలు జీర్ణించుకోలేకపోయినట్లు సమాచారం. పార్టీలోని మెజారిటి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఐదారుగురు నేతలకే పార్టీ పెత్తనాన్ని చంద్రబాబు అప్పగించటం పెద్ద తప్పుగా ఒక నేత చెప్పారట. మరోనేత మాట్లాడుతు టీడీపీలోని కొందరు కీలకనేతలకు వైసీపీ నేతలతో వ్యాపారబంధాలున్నాయని ఆరోపించారట.
పార్టీ నేతల్లో కొందరు వైసీపీకి ఎన్నికల్లో అమ్ముడుపోయారని మరో నేత మండిపడ్డారట. ఎన్నికలు జరుగుతాయని అందరికీ తెలిసనప్పటికీ చివరి నిముషంవరకు ఎందుకని అభ్యర్ధలను ఫైనల్ చేయలేదని మరో నేత చంద్రబాబునే సూటిగా ప్రశ్నించారట. అభ్యర్ధులను చివరి నిముషంలో ఫైనల్ చేస్తే వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తారు ? ప్రత్యర్ధులకు ఎలా ఫైట్ ఇస్తారని గట్టిగానే నిలదీశారట.
ఈ పాయింట్లన్నీ ఓకేనే కానీ కుప్పంలో చంద్రబాబుకు ఇల్లులేదు కాబట్టి నాన్ లోకల్ అని వైసీపీ చేసిన ప్రచారాన్ని జనాలు నమ్మినట్లు మరో నేత చెప్పారు. అందుకనే కుప్పంలో ఒక ఇల్లు కట్టుకుని కనీసం 3 నెలలకు ఒకసారైనా నియోజకవర్గానికి రావాలని ఒక నేత చెప్పిన విషయంపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. 30 ఏళ్ళుగా ఎంఎల్ఏగా గెలుస్తున్న చంద్రబాబును కుప్పంలో నాన్ లోకల్ అని వైసీపీ వాళ్ళు చేసిన ప్రచారాన్ని జనాలు నమ్మారని ఒకనేత చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.
సమీక్షలో ఎక్కువమంది వాస్తవ పరిస్ధితులను ప్రస్తావిచంటంతో చంద్రబాబు సమీక్షను ముగించేశారు. మామూలుగా అయితే ఏ విషయంలో సమీక్షలు జరిగినా చంద్రబాబే ఎక్కువ మాట్లాడుతారు. మాట్లాడేందుకు నేతలకు చాలా తక్కువ సమయం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం కుప్పంలో ఓటమికి కారణాలను నేతలు ధైర్యంగానే చెప్పారంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇఫుడు కూడా తనకన్నీ విషయాలు తెలుసని, ఓడిపోయిన అభ్యర్ధులందరు ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి సమీక్షను ముగించేశారు.