సుప్రీంలో సీరియ‌స్ లోపాన్ని ఎత్తి చూపించారుగా?

Update: 2018-10-05 06:09 GMT
కొన్ని త‌ప్పులు అల‌వాటుగా జ‌రిగిపోతుంటాయి. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి సాగే కొన్ని విధానాల్ని నిశితంగా గ‌మ‌నిస్తే.. అందులోని లోపాలు క‌నిపించ‌ట‌మే కాదు.. ఇంత‌కాలం మ‌నం ఎలా ఊరుకున్నామ‌న్న ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతుంది. తాజాగా అలాంటి లోప‌మే ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసింది.

సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా వ్య‌వ‌హ‌రించే న్యాయ‌మూర్తి భార‌త‌దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తా  లేక సుప్రీంకోర్టుకు మాత్ర‌మేనా? అన్న క్వ‌శ్చ‌న్ ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చింది. ఇంత‌కాలంగా ఈ టెక్నిక‌ల్ అంశాన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. తాజాగా సీనియ‌ర్ సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్ పుణ్య‌మా అని కొత్త లోపం ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది.

ఇంత‌కూ ఆయ‌న చెప్పేదేమంటే.. సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా వ్య‌వ‌హ‌రించే వ్య‌క్తి సుప్రీంకోర్టుకు మాత్ర‌మే సీజేనా?  లేక‌.. దేశం మొత్తానికి ప్ర‌ధాన న్యాయ‌మూర్తా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే.. రాజ్యాంగం ప్ర‌కారం చూస్తే.. ప్ర‌మాణ‌స్వీకార ప‌త్రంలో ఆయ‌న్ను సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న‌కు ఇస్తున్న నియామ‌క ప‌త్రంలో మాత్రం ఆయ‌న్ను భార‌త దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అని ఇస్తున్నారు.

ఈ రెండింటి మ‌ధ్య వ్య‌త్యాసం నేప‌థ్యంలో సుప్రీంకోర్టు ప‌ధాన న్యాయ‌మూర్తి పాత్ర దేనికి చెందుతుంది? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. కురియ‌న్ జోసెఫ్ లేవెనెత్తిన ఈ ప్ర‌శ్న న్యాయ వ‌ర్గాల్లో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసింది. నియామ‌క ప‌త్రంలో ఒకలా.. ప్ర‌మాణ‌ప‌త్రంలో మ‌రోలా సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప‌ద‌విని పేర్కొన్న నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రు?  ప‌రిధి ఏమిటి? అన్న‌ది ఇప్పుడు తేల్చాల్సిన అవ‌స‌రం ఉంది. ఇంత‌కీ కురియ‌న్ ఏం చెబుతున్నార‌న్న‌ది ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. దేశం మొత్తానికి ప్రధాన న్యాయమూర్తా లేక సుప్రీంకోర్టుకు మాత్రమేనా? నియామక పత్రంలో ఆయనను భారత దేశ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) అని రాశారు. ఇక రాజ్యాంగం ప్రకారం చేసే ప్రమాణస్వీకార పత్రంలో ఆయనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఎస్‌సీ) అని పేర్కొన్నారు. అంటే రాష్ట్రపతి నియమించిన ‘భారత ప్రధాన న్యాయమూర్తి’ అదే రాష్ట్రపతి చేతుల మీదుగా- ‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూరి’్తగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఇది పెద్ద లోపం. దీనిని స‌రి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News