రాష్ట్ర విభజనపై రాజకీయ నాయకులు తమ ఎజెండాలకు అనుగుణంగా మాట్లాడటం మామూలే. జరుగుతున్న అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నా.. తమ ధర్మాన్ని పాటిస్తూ.. నోటికి తాళాలు వేసుకొని ఉంటారు ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు. పాలనకు సంబంధించినంత వరకూ వారికి తెలిసినంత బాగా రాజకీయ నాయకులకు అస్సలుతెలీదనే చెప్పాలి. కానీ.. ప్రజాస్వామ్యంలో తమకు బాధ్యత.. పరిమితుల దృష్ట్యా చాలా విషయాల్లో మౌనంగా ఉంటారు. ప్రభుత్వ విధానాల్ని అమలు చేస్తూ.. తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తుంటారు.
ఇలాంటి వారికి కాస్త భిన్నంగా కొందరు అధికారులు వ్యవహరిస్తుంటారు. అయితే.. ఇటీవల కాలంలో ఏపీకి చెందిన ఒక కలెక్టర్ ఓపెన్ అయి.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటం మాత్రం జరగలేదని చెప్పక తప్పదు. ఇందుకు భిన్నంగా తాజాగా కర్నూలు జిల్లా కలెక్టర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఆంధ్రా.. రాయలసీమలకు తీరని అన్యాయం జరిగిందని.. దానిని తలుచుకుంటేనే కడుపు మండుతోందని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వ్యాఖ్యానించారు.
బుధవారం జరిగిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేత ఒకరు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించి ఇస్తోందని.. పలు సంక్షేమ పథకాల్ని అమలు చేస్తుందని.. అదే తీరులో ఏపీలో కూడా అమలు చేయాలన్న వ్యాఖ్యలపై స్పందించిన కలెక్టర్.. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ అన్యాయం చేసిందని.. విభజన కారణంగా కర్నూలు నాశనమైందని వ్యాఖ్యానించారు. ఒక ఐఏఎస్ అధికారి ఇంతలా మాట్లాడటం లేదని చెప్పాలి. మరీ వ్యాఖ్యలు ఏ రాజకీయ మంటలకు దారి తీస్తాయో? తాజా వ్యాఖ్యలు చూస్తే.. విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయానికి సంబంధించి ప్రజల్లోనూ.. అధికారుల్లోనూ అంతర్గతంగా ఎంత ఆగ్రహంగా ఉన్నారన్న విషయం స్పష్టమవుతుందో చెప్పొచ్చు. ఇలాంటి వేళ.. ఏపీకి ఎంతో ప్రయోజనం కలిగించే ప్రత్యేక హోదా అంశాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వదిలేయటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/