కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో కరోనా భాదితులు 300 కి చేరువలో ఉన్నారు. ఇకపోతే కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ..మా కుటుంబ సభ్యులకి కరోనా సోకినా మాట వాస్తవమే అని, కర్నూలు నర్సింగరావుపేట లో ఉన్న తన సోదరుల కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని, వీరంతా రాష్ట్ర కరోనా హాస్పిటల్ అయిన కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
కాగా, ఎంపీ తండ్రి, సోదరుడితో పాటు మరో నలుగురికి కరోనా సోకగా వీరంతా, క్షేమంగానే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా ఆస్పత్రిలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని , ప్రతి ఒక్కరు కరోనా నుండి కోలుకుంటారని అయన తెలిపారు. కర్నూలులో కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయని మీడియాలో వస్తున్న వార్తల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని, అయితే దీని గురించి భయపడాల్సిన పనిలేదని ఆయన తెలిపారు. ఇతర దేశాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటాన్ని చూసి ఇక్కడి వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లాక్ డౌన్ ఆంక్షలను రెడ్ జోన్లలో పొడిగించి.. గ్రీన్ జోన్లలో విడతల వారీగా ఎత్తివేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.