బాబుపైకి కేవీపీ మ‌రో అస్త్రాన్ని సంధించేశారు!

Update: 2017-04-16 05:35 GMT
రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో తీవ్ర ఆర్థిక స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్న న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు త‌న పోరాటాన్ని ఇప్పుడ‌ప్పుడే ఆపేలా లేరు. ఎంద‌కుంటే... కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ఒక మాట చెబితే... ఆ మాట‌కు మ‌సిపూసి మారేడు గాయ చేస్తూ... ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చాక స‌మ‌స్య‌ల‌న్నీ తీరిపోతాయ‌న్న చందంగా ప్ర‌చారం చేసుకుంటున్న చంద్ర‌బాబు స‌ర్కారు అస‌లు రంగును బ‌య‌ట‌పెట్టడానికి ఆయ‌న ఎప్పుడో కార్య‌రంగాన్ని సిద్ధం చేసుకున్నారు.

ఈ క్ర‌మంలో న‌వ్యాంధ్ర రూపు రేఖ‌లే మార్చేస్తుంద‌ని భావిస్తున్న జాతీయ ప్రాజెక్టు హోదా క‌లిగిన పోల‌వ‌రం ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖ‌ర్చు కేంద్ర‌మే భ‌రిస్తుంద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్న మాట తెలిసిందేగా. అయితే ఆ మాట‌లో ఏమాత్రం నిజం లేద‌ని చెబుతూ... కేంద్రం నుంచి ప‌క్కా గ‌ణాంకాల‌తోనే కాకుండా... తాము ఇచ్చే స‌హాయాన్ని విస్ప‌ష్టంగా కేంద్రం స్ప‌ష్టంగా చెప్పేలా కేవీపీ ప‌థ‌కం ర‌చించారు. ఇందులో భాగంగా మొన్న ఆయ‌న సంధించిన ఓ ప్ర‌శ్న‌కు కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి ఉమాభార‌తి... 2014 నాటి అంచ‌నాల మేర‌కే తాము పోల‌వ‌రానికి సాయం చేస్తామ‌ని, చంద్రబాబు స‌ర్కారు పెంచిన అంచనాల మేర‌కు నిధులిచ్చేది లేద‌ని కూడా తేల్చి చెప్పారు.

తాజాగా పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన పున‌రావాస ప్యాకేజీ గుట్టు విప్పేందుకు కూడా కేవీపీ రంగంలోకి దిగారు. పోల‌వ‌రం ప్రాజెక్టు కార‌ణంగా నిరాశ్ర‌యుల‌వుతున్న కుటుంబాల‌కు పున‌రావాసం ఏర్పాటు చేయాల్సిన నిధుల బాధ్య‌త ఎవ‌రిదంటూ ఆయ‌న కేంద్రానికి ఓ లేఖాస్త్రం సంధించారు. ఏ ఎంపీ హోదాలో ఆయ‌న సంధించిన లేఖ‌కు కేంద్రం కూడా విస్ప‌ష్టంగానే స‌మాధానం ఇవ్వ‌డం ఖాయ‌మే. మ‌రి పున‌రావాసంలో చంద్ర‌బాబు స‌ర్కారు చెబుతున్న మాట‌లు నిజ‌మేనా?  కాదా? అన్న విష‌యం నేడో - రేపో తేలిపోనుంద‌న్న మాట‌. అయితే కేంద్రం నుంచి వ‌చ్చే స‌మాధానం వాస్త‌వానికి నిలువుట‌ద్దంలా నిలుస్తుంద‌నే చెప్పాలి. మ‌రి కేంద్రం మాటకు త‌న మాట‌ను చేర్చి టీడీపీ స‌ర్కారు చేసుకుంటున్న ప్ర‌చారంలోని అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డ‌టం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News