‘చంద్ర‌బాబు, లోకేష్.. పాలు, కూర‌గాయ‌లు అమ్ముకోవాల్సిందే..!’

Update: 2021-03-15 05:30 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయ‌న కొడుకు లోకేష్ పాలు, కూర‌గాయ‌లు అమ్ముకుని బ‌త‌కాల్సిందేన‌ని నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి అన్నారు. ఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌జ‌ల గుండెల్లో స్థానం సంపాదించార‌ని, ఆ విష‌యాన్ని వ‌రుస ఫ‌లితాలు నిరూపిస్తున్నాయ‌ని అన్నారు.

జ‌గ‌న్ మ‌రో 30 సంవ‌త్స‌రాల పాటు ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తార‌ని చెప్పిన ల‌క్ష్మీపార్వ‌తి.. చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌న్నారు. టీడీపీలో నిజ‌మైన ఎన్టీఆర్ అభిమానులు ఉంటే.. చంద్ర‌బాబును వ‌దిలేయాల‌ని పిలుపునిచ్చారు. త‌న భ‌ర్త‌ను అవ‌మానించిన పార్టీ ఉన్నా.. ఊడినా ఒక‌టే అన్న ఆమె.. బాబు చేసిన పాపాలే కొడుకు రూపంలో వెన్నాడుతున్నాయ‌ని అన్నారు.

బ‌లవంతంగా లాగేసుకున్న తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయ‌లు సంపాదించుకున్నార‌ని ల‌క్ష్మీపార్వ‌తి ఆరోపించారు. ఎన్టీఆర్ కు చేసిన అవ‌మానం ఇప్పుడు వాళ్ల‌కు జ‌రిగింద‌ని, ఈ విష‌యం అర్థం చేసుకోవ‌డానికి కూడా లేకుండా మైండ్ చెడిపోయింద‌ని మండిప‌డ్డారు. టీడీపీ భూస్థాపితం కావడం ఖాయ‌మ‌ని చెప్పారు.
Tags:    

Similar News