ప్రధాని లోన్ తీసుకోని కార్ కొన్నాడు .. ఆ తర్వాత ఏమైందంటే ?

Update: 2021-03-13 07:31 GMT
లాల్ బహదూర్ శాస్త్రి  ... మాజీ ప్రధాని , అలాగే నిజాయతీ అన్న పదానికి నిలువెత్తు రూపం. నిజాయతీ అన్న పదం ఈయన్ని చూసే పుట్టిందా అని అనిపిస్తుంది. ఆయనెంత నిజాయతీ పరుడంటే, భారత దేశానికి ప్రదానమంత్రిగా ఉండి కూడా , సొంతంగా  ఓ కారు కూడా కొనుక్కోలేనంత నిజాయతీ. నేను ప్రధాని అయితే ఏమి , తనకి కారు అవసరమా అని ఆలోచించారు.  అయితే ప్రధానమంత్రిగా ఉండి కారు లేకపోవడమేంటని, కుటుంబసభ్యులు ఒత్తిడి చేయడంతో , కుటుంబ సభ్యుల ఒత్తిడి , కోరిక మేరకు చివరకు ఓ ఫియట్ కారు కొన్నారు లాల్ బహదూర్ శాస్త్రీ.

ఆరోజుల్లో కారు ధర 12 వేల రూపాయలు ఉండగా , అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రీజీ ఖాతాలో కేవలం రూ.7  వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర 5 వేల రూపాయల రుణం తీసుకున్నారు. అయితే ఆ కారు రుణం పూర్తిగా చెల్లించకుండానే లాల్ బహదూర్ శాస్త్రి మరుసటి ఏడాది మరణించారు.  1964 మోడల్ ఫియట్ కారు  ప్రస్తుతం ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్‌లో ప్రదర్శనకు ఉంచారు. తాష్కెంట్ ‌లో లాల్ బహదూర్ శాస్త్రీ మరణం తర్వాత ఈ విషయం వెలుగు చూసింది.  ఆ తర్వాత ప్రభుత్వం తరపున ఆ లోనే మాఫీ చేస్తాం అని ఇంధిరా గాంధీ చెప్పినా అయన భార్య అందుకు ఒప్పుకోలేదు.    ఆమె తనకొచ్చిన పెన్షన్‌ నుంచి డబ్బులను చెల్లిస్తూ వచ్చారు. చివరకూ అప్పు తీర్చేశారు. ఈ విషయం తెలుసుకున్న దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రీజీ అభిమానులందరూ మాజీప్రధాని భార్యకు డబ్బులు విరాళాలుగా పంపారు. డబ్బులు పంపిన వారందరికీ ఆమె తిరిగి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉత్తరాలు రాశారు. ఆ తర్వాత వారందరికీ డబ్బులు తిరిగి పంపించేశారు.

ఇదిలా ఉంటే .. . లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభమును తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసాడు. తరువాత దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై  బాటలుపరిచాడు.
Tags:    

Similar News