బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించిందని ప్రకటించారు వైద్యులు. గత కొన్నాళ్లుగా ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందుతున్నారు లాలూ. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన చేశారు. మూత్రపిండాల పనితీరు విషయంలో లాలూ ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. కిడ్నీస్ సరిగా పని చేయడం లేదని వైద్యులు తెలిపారు.
ఒకప్పుడు నవ్వుతూ - నవ్విస్తూ - సరదా సంభాషణలతో వార్తల్లో ఉండే వారు లాలూ ప్రసాద్ యాదవ్. అయితే కొన్నేళ్లుగా ఆయనను ఇబ్బందులు చుట్టుముట్టాయి. దశాబ్దాల నాటి గడ్డి స్కామ్ లో ఆయన కు శిక్ష ఖరారు కావడంతో జైలుకు వెళ్లారు. జైల్లోనే ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో అక్కడ నుంచి ఆసుపత్రికి చేరారు.
పట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంటూ లాలూ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టుగా తెలుస్తోంది. ఇక లాలూ పార్టీ కూడా ఇబ్బందుల్లోనే ఉంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ మెరుగైన ఫలితాలే సాధించింది. నితీశ్ కుమార్ పార్టీతో కలిసి పోటీ చేసి అధికారాన్ని సంపాదించుకుంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్లకు ఆర్జేడీకి నితీశ్ హ్యాండిచ్చాడు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దీంతో ఆర్జేడీ కి అధికారం చేజారింది.
ఇక లోక్ సభ ఎన్నికల్లో బిహార్ లో మోడీ హవా గట్టిగా వీచింది. దీంతో ఆర్జేడీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఇక శిక్షను ఎదుర్కొంటూ ఆసుపత్రికే పరిమితం అయ్యారు లాలూ. ఆయన తనయుల్లో ఒకరు వివాదాల్లో ఉంటూ వస్తున్నారు.