రాజకీయాల్లో విమర్శలు - ప్రతివిమర్శలు సహజమే. అయితే, ఒక్కోసారి వాటిల్లో లాజిక్ మిస్ అవుతుండటం మనం గమనిస్తుంటాం. తాజాగా సీనియర్ రాజకీయవేత్త లాలూప్రసాద్ యాదవ్ చేసిన కామెంట్లు దీనికి ఉదాహరణ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం ఓ జాతీయ ఛానల్‌తో మాట్లాడుతూ దేశంలో నడుస్తున్న కుటుంబ రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ఈ ట్రెండ్ ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలిపెట్టు అంటూ కామెంట్ చేశారు. కుటుంబ రాజకీయాలపై ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీకి పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వారసత్వ రాజకీయాలపై మోడీ స్పందిస్తూ ``రామ్‌మనోహర్ లోహియా కుటుంబం రాజకీయాల్లో ఉందా? ఆయన ఓ సోషలిస్టు. ఫెర్నాండేజ్ కుటుంబం రాజకీయాల్లో ఉందా? ఈయనా ఓ సమాజ్‌వాదీ. బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాతో కలిసే పనిచేస్తున్నారు. ఆయన కూడా ఓ సోషలిస్టు. వారి కుటుంబం రాజకీయాల్లో ఉందా? ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలు పెద్ద శత్రువు' అంటూ మోడీ విమర్శించారు. దీనిపై లాలూ స్పందిస్తూ , ప్రధాని మోడీకి, బిహార్ సీఎం నితీశ్‌కి పిల్లలు కలగాలని తాను దేవుణ్ని ప్రార్థిస్తానని తెలిపారు. అంతేకాకుండా వారు కూడా రాజకీయాల్లోకి రావాలని ప్రార్థిస్తానని లాలూ కౌంటర్ ఇచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, సీఎం నితీశ్‌కు పిల్లలు లేకపోతే తానేం చేయాలని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రశ్నించారు. `` సీఎం నితీశ్‌కి ఓ కుమారుడు ఉన్నాడు. కానీ ఆయన రాజకీయాలకు సరిపడడు. నేనేం చేయగలను? అందుకే వారి పిల్లలు కలగాలని నేను దేవుణ్ని ప్రార్థిస్తాను. వారు రాజకీయాల్లోకి రావాలని కూడా ప్రార్థిస్తాను`` అని లాలూ ప్రసాద్ పేర్కొన్నారు. అయితే, ఈ కామెంట్లపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. లాలూ సెటైర్లు బాగానే ఉన్నాయని పేర్కొంటూ ఈ వయసులో ప్రధాని మోడీకి పిల్లలు ఏంటి లాలూజీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ``మీరేం మాట్లాడుతున్నారో కనీసం మీకైనా అర్థమవుతోందా?`` అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.