కశ్మీర్ లోని యూరి పట్టణంలో నలుగురు పాక్ ముష్కరులు పెద్ద ఎత్తున ఆయుధాలు - పేలుడు పదార్థాలతో సైనిక స్థావరంపై విరుచుకుపడ్డారు. ప్రికిపందలకు పద్దతులు ఏముంటాయి, సిగ్గు వదిలేసిన వారికి రూల్స్ ఏమి వర్తిస్తాయి.. టెంట్ల కింద నిద్ర పోతున్న జవాన్లపై విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు.. బాంబులు విసిరారు. కళ్లుమూసి తెరిచేలోపు ఏకంగా 17 మందిని పొట్టనబెట్టుకున్నారు! ఈ హఠాత్పరిణామం నుంచి వెంటనే తేరుకున్న భారత సైనికులు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు! ఈ విషయంపై భారత్ ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఈ విషయాలపై ఆర్.జే.డి. అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మోడీని టార్గెట్ చేశారు.
గత 25 ఏళ్లలో కశ్మీర్ లో మన సైన్యంపై ఇప్పుడు జరిగిందే అతి పెద్ద దాడి కావడంతో.. జమ్ముకశ్మీర్ పరిస్థితులను సర్దుమణిగేలా చేయడంలో అక్కడి సమస్యకు పరిష్కారం చూపడంలో ప్రధాని నరేంద్రమోడీ విఫలమయ్యారని లాలూ ఆరోపించారు. ఈ దాడికి ప్రధాని నరేంద్రమోడీదే బాధ్యత అని ఆయన మండిపడ్డారు. ఈ దాడులకు ప్రధాని నిర్లక్ష్యమే ప్రధానకారణమన్న లాలూ.. నరేంద్రమోడీ నిర్లక్ష్యం వల్లే సైనికులు చనిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోడీ 56 అంగుళాల ఛాతీపై స్పందించిన ఆయన.. ఆ ఛాతీ ఇప్పుడెక్కడికి పోయిందని విమర్శించారు.
కాగా.. యూరిలో ఉగ్ర దాడికి తెగబడ్డ వారిని శిక్షించి తీరుతామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఉగ్ర కారకులు శిక్ష నుంచి తప్పించుకోలేరని ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని హామీ ఇచ్చారు. ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ప్రధాని.. ఈ మేరకు ట్వీట్ చేశారు. అమర జవాన్ల సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.